Who is Soubin Shahir? మోనికా ఐ లవ్ యూ అంటున్న సౌబీన్ షాహిర్ ఎవరు? పూజాహెగ్డేతో స్టెప్పులతో యాక్టర్ అదుర్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పాన్ ఇండియా మూవీ కూలీ విడుదలకు సిద్దమవుతున్నది. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున అక్కినేని, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబీన్ షాహీర్, శ్రుతి హాసన్, మహేంద్రన్ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్సెస్, పాటలు భారీ అంచనాలు పెంచాయి. ఈ క్రమంలో పూజా హెగ్డేకు సంబంధించిన రెండో పాటను తాజాగా రిలీజ్ చేసిన వెంటనే వైరల్ మాత్రమే కాకుండడా ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ పాటలో డ్యాన్స్ చేసిన నటుడు ఎవరనే విషయం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆ యాక్టర్ ఎవరనే విషయంపై గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. ఆ నటుడి వివరాల్లోకి వెళితే..
కూలీ సినిమాలో మోనికా ఐ లవ్ యూ అనే పాటను ఇటీవల గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ పాటలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన పూజా హెగ్డే ఆకర్షణీయంగా కనిపించింది. ఇక ఆమె వేసిన స్టెప్పుల ఊపు, ఆమె బాడీ ల్వాంగేజ్, పాటలో ఆమె ప్రదర్శించిన యాటిట్యూడ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. మోనికా ఇంటర్నెట్‌లో ఫైర్ క్రియేట్ చేసింది. వెంటనే ఆ పాట ట్రెండింగ్‌లోకి వచ్చింది. సినిమా ప్రేక్షకులను భారీగా ఆకట్టుకొంటున్నది.

కూలీ సినిమాకు పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటకు అందించిన మాస్ బీట్ సాధారణ ప్రేక్షకులకే కాకుండా క్లాస్ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా చేసింది. అదిరిపోయే బీట్స్ కోసం సబ్బలక్ష్మీ గాత్రాన్ని స్పూర్తిగా తీసుకొని ఆ గళానికి ర్యాప్ జోడించి అసల్ కోలార్ మత్తెక్కించేలా పాడారు. తెలుగులో ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, సుబ్లాషిణి, అనిరుధ్ రవిచంద్రన్ ఆలపించారు.
అయితే ఈ పాటలో పూజా హెగ్డే గ్లామర్‌ను పక్కన పడితే.. ఆమె పక్కన.. మోనికా.. గిచ్ గిచ్ మా.. ఐ లవ్ యూ అడుగులో అడుగు వేసి స్టెప్పులేసిన నటుడు ఎవరు? ఆయనకు ఈ లక్కీ ఛాన్స్ ఎలా దక్కింది అనే విషయం నెటిజన్లు, సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అయితే ఎవరో కాదు మలయాళ నటుడు సౌబీన్ షాహీర్ అనే విషయం వారికి గూగుల్ సర్చ్ చేస్తే స్పష్టమైంది. బుట్టబొమ్మతో కలిసి స్పీడ్‌గా ఆయన వేసిన స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నాయి.

ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అవుతున్న కూలీ సినిమాను తెలుగులో ఏషియన్ సునీల్, డీ సురేష్ బాబు, భరత్ నారంగ్, దిల్ రాజు తదితరులు రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, ఫిలోమిన రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా నమోదవుతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











