Who Is Venkitesh VP? వెంకటేష్ వీపీ ఎవరు? స్పీచ్‌తో కింగ్డమ్ యాక్టర్ అదుర్స్.. అనిరుధ్ ఈలవేసి.. విజయ్ చప్పట్లు.

తెలుగు సినిమా పరిశ్రమలో మలయాళ సినీ రంగానికి చెందిన నటీనటులకు ఎప్పుడైనా పెద్ద పీట వేయడం సహజంగా ఎక్కువగా కనిపిస్తుంటుంది. హీరోయిన్లే కాకుండా హీరోలకు కూడా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. హీరోయిన్లు నిత్య మీనన్, అనుపమ పరమేశ్వరన్, సమంత, అలాగే హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి హీరోలు మంచి సక్సెస్‌ను అందుకొన్నారు. ఇంకా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ప్రశంసలు అందుకొన్నారు. తాజాగా వెంకటేశ్ వీపీ అనే నటుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. తన తొలి చిత్రం కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన తెలుగులో చేసిన ప్రసంగం వైరల్ అయింది. ఇంతకు వెంకటేష్ వీపీ ఎవరనే వివరాల్లోకి వెళితే..

కేరళలోని తిరువనంతపురం నగరానికి చెందిన వెంకటేశ్ వీపీ మలయాళంలో నాయిక నాయకన్ అనే టాలెంట్ హంట్ షో ద్వారా వెలుగులోకి వచ్చాడు. మిజి తురక్కు అనే సినిమా ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత స్టాండప్, ఖో ఖో, ది ప్రీస్ట్ అనే చిత్రాల ద్వారా పాపులారిటీని సొంతం చేసుకొన్నాడు. దాదాపు డజనుకుపైగా చిత్రాల్లో నటించాడు. ఆయన తాజాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా ద్వారా తెలుగులోకి అడుగుపెట్టారు.

Who Is Venkitesh VP

కింగ్టమ్ సినిమా ఈవెంట్‌లో తెలుగులో తొణుకుబెణుకు లేకుండా మాట్లాడటం అందర్నీ ఆకట్టుకొన్నది. ప్రతీ ఒక్కరిని తన మాటలతో ఆశ్చర్యపరిచారు. ఆయన మాట్లాడుతూ.. ఇంత మంది ప్రజలు మధ్య ఇలాంటి ఈవెంట్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మలయాళం ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్‌లో ఒకట్రెండు డైలాగ్స్ చెప్పే ఆర్టిస్టు నుంచి కింగ్డమ్ మూవీలో మంచి రోల్ చేయడం నా అదృష్టం. ఈ స్టేజ్‌కు రావడానికి 9 ఏళ్లు పట్టింది. ఇలాంటి అవకాశాన్ని కల్పించిన సితారా ఎంటర్‌టైన్‌మెంట్, నాగవంశీకి ధన్యవాదాలు. నాకు కారవాన్ డోర్ దొరికిన తొలి సినిమా. నాకు హీరోల కూడా నటించాలనుకొంటున్నాను అని అన్నారు.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మా అమ్మకు ఫోన్ చేసి మీ అబ్బాయి మంచి నటుడు చెప్పారు. నన్ను హీరోల చూసుకొన్నాడు. ఆయన లాంటి మనిషిని మరిచిపోవడానికి ఆయన కొండపై ఉన్న దేవుడు కాదు. నా గుండెల్లో ఉన్న అన్న అంటూ కామెంట్ చేశాడు. జూలై 31వ తేదీన రిలీజ్ అవుతున్నది. నా ఎంట్రీకి క్లాప్స్ కొట్టండి. నేను ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చెప్పాను. నన్ను గుర్తుపెట్టుకొండి.నన్ను తెలుగులో ఆదరించి అవకాశాలు ఇప్పించండి అంటూ కామెంట్ చేశాడు. వెంకటేష్ మాట్లాడుతున్నంత సేపు విజయ్ దేవరొకండ చప్పట్లు కొడుతూ.. అనిరుధ్ ఈలలు వేస్తూ కనిపించారు.

వెంకటేష్ వీపీ గురించి విజయ్ దేవరకొండ ట్వీట్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా ప్రపంచానికి వెంకటేష్ వీపీ అలియాస్ మురుగన్ పరిచయం చేస్తున్నాను. అతడికి కేవలం నాలుగో సినిమా. అతడితో కలిసి కొన్ని సీన్లలో నటించాను. ఆయన పెర్ఫార్మెన్స్‌తో అతడి ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ప్రతిభావంతుడైనా యాకటర్. నిప్పులు చెరిగే కళ్లు. మంచి ఎనర్జీ. అంతకంటే మంచి మనసు ఉన్న మనిషి. సినిమా పరిశ్రమలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకొంటాడు అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేసి ప్రశంసించారు.

టాలీవుడ్‌లో యువ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన తాజా చిత్రం కింగ్డమ్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సారథ్యంలో శ్రీకర స్టూడియోస్ సమర్పించారు. ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్, జోమోన్ టి జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్లుగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X