For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సినిమా గురించి మాటల్లో పెట్టి ముద్దు పెట్టాడు.. అసభ్యంగా టచ్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు

  |

  సినీరంగంలో నిత్యం ఎవరో ఒకరు లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. చాలామంది అగ్ర హీరోయిన్స్ కూడా మీటు అంశాన్ని హైలెట్ చేస్తూ వారికి జరిగిన చేదు అనుభవాలను కూడా ధైర్యంగా బయటపెట్టారు. అయితే కొంత మంది మాత్రం మొదట భయపడినా ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఒక ప్రముఖ నటుడు నిర్మాత మాటల్లో పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడని, సినిమా కోసం మాట్లాడుతానని రూమ్ లోకి తీసుకెళ్లి తప్పుగా ప్రవర్తించినట్లు ఒక యువతి పేర్కొంది వివరాల్లోకి వెళితే..

  పెద్దగా మార్పులేమీ రాలేదు

  పెద్దగా మార్పులేమీ రాలేదు

  మీటు అనే అంశం అప్పట్లో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది అగ్ర నటీనటులు కూడా ఆ విషయంలో చాలా ధైర్యంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ముఖ్యంగా కొంతమంది సినీ ప్రముఖులు హీరోయిన్స్ పై అసభ్యంగా ప్రవర్తించినట్లు గా అనేక రకాల కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నప్పటికీ కూడా ఇంకా ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేమీ రాలేదు అని కూడా అనిపిస్తోంది. మళ్లీ ఎప్పటిలానే కొత్త తరం నటిమణులు కొందరు చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు.

  నటుడిపై ఆరోపణలు

  నటుడిపై ఆరోపణలు

  రీసెంట్ గా ఒక నటుడు నిర్మాత తనపై అసభ్యంగా ప్రవర్తించాడని రూమ్లోకి తీసుకెళ్లి సినిమా గురించి మాట్లాడతానని చెప్పి ఇబ్బంది పెట్టినట్లుగా ఆమె వివరణ ఇచ్చింది. సినిమా చర్చలో భాగంగా మాటల్లో పెట్టి హఠాత్తుగా ముద్దు కూడా పెట్టేసినట్లు ఆమె తెలియజేసింది అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను అదే పనిగా చెడుగా ప్రవర్తించినట్లు వివరణ ఇచ్చింది.

  ఇదివరకే..

  ఇదివరకే..

  ఆ నటుడు నిర్మాత మరెవరో కాదు ఇదివరకే కొన్ని సార్లు పలు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళం నటుడు విజయ బాబు. ఇక మరొక అమ్మాయి ని ఇబ్బంది పెట్టినట్లుగా మలయాళం ఇండస్ట్రీలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఇదివరకే ఒక మహిళ అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరొక మహిళ సోషల్ మీడియా ద్వారా అతని చెడు బుద్ధి గురించి చాలా క్లారిటీ గా వివరణ ఇచ్చింది.

   మందు తగామని..

  మందు తగామని..

  నటుడు, నిర్మాత, ఫ్రైడే ఫిలిం హౌస్‌ అధినేత విజయ్‌బాబును 2021 నవంబర్‌లో కలిశాను అంటూ సినిమా చర్చలో భాగంగానే అతనితో మాట్లాడడం ఒప్పుకున్నట్లుగా ఆమె వివరణ ఇచ్చింది. అనంతరం పలు వ్యక్తిగత విషయాల గురించి సమస్యల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగిందని ఇక అతను మందు తాగుతూ నన్ను కూడా మందు తాగమని ఫోర్స్ చేశాడు.. కానీ నేను అందుకు ఒప్పుకోలేదని ఆమె తెలియజేసింది.

   ముద్దు పెట్టాడు

  ముద్దు పెట్టాడు

  ఇక ఆ తర్వాత మాటల్లో పెట్టి అతను హఠాత్తుగా ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. మొదట నేను గ్రహించక ముందే అతను నా పెదవులపై ముద్దు పెట్టేసాడు. ఇక ఆ తర్వాత కూడా మళ్లీ ప్రయత్నించడానికి ముందుకు రాగానే నేను అతన్ని నుంచి తప్పించుకుని దూరంగా జరిగి పోయాను. అయినప్పటికీ కూడా తను మరో ముద్దు కావాలి అని బ్రతిమాలాడాడు. ఇక నేను వద్దని చెప్పి వాదించాను. అనంతరం అతను ఈ విషయాన్ని ఎక్కడా బయట పెట్టవద్దని కూడా అన్నాడు. నేను కూడా సరే అని చెప్పాను.. అని పేర్కొంది.

  భయపడి వెనక్కి వచ్చేశాను

  భయపడి వెనక్కి వచ్చేశాను

  కేవలం అరగంటలోనే అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటే ఇంతకు ముందు అతని చేతుల్లో ఎంత మంది అమ్మాయిలు బలైపోయి ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. అతని కారణంగా నేను నా సినిమా కలను కూడా వదిలేసికోవాల్సి వచ్చింది. అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడే ఇండస్ట్రీ నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాను. ఇలాంటి దుర్మార్గుల నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పగానే నేను కూడా చెప్పాలని అనుకున్నాను. అతను సహాయం కోసం ఎదురు చూసే అమ్మాయిలను లోబరుచుకుంటాడు. ఇలాంటి వాళ్లను శిక్షించి ఇండస్ట్రీలోకి రాబోయే అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వాలి అని ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకు మంచిదికాదు అనే అపోహను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.

  ఎందుకు ఫిర్యాదు చేశానంటే?

  ఎందుకు ఫిర్యాదు చేశానంటే?


  విజయ్‌బాబుపై ఫిర్యాదు గురించి వివరిస్తూ.. ఇటీవల ఒక అమ్మాయి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పగానే నేను కూడా చెప్పాలని అనుకున్నాను. అతను సహాయం కోసం ఎదురు చూసే అమ్మాయిలను లోబరుచుకుంటాడు. ఇలాంటి వాళ్లను శిక్షించి ఇండస్ట్రీలోకి రాబోయే అమ్మాయిలకు ధైర్యాన్ని ఇవ్వాలి అని ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకు మంచిదికాదు అనే అపోహను కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె తెలియజేశారు.

  English summary
  Women shocking social media post on malayalam actor and producer vijay babu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X