twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండెపోటుతో యువ దర్శకుడు కన్నుమూత.. షాక్‌లో సినీ ప్రముఖులు

    |

    కరోనా లాక్‌డౌన్ సమయంలో మలయాల చిత్ర పరిశ్రములో మరో విషాదం చోటుచేసుకొన్నది. యువ దర్శకుడు జిబిత్ జార్జ్ ఆకస్మికంగా కన్నుమూశారు. మే 9వ తేదీ రాత్రి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. జిబిత్ మరణంతో మాలీవుడ్ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. జిబిత్ ఒక లేరనే విషయం తెలుసుకొని తల్లడిల్లిపోయారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. జిబిత్ మరణం గురించి మరిన్ని వివరాలు..

    Recommended Video

    Malayalam Young Director Jibit George Passed Away | Filmibeat Telugu
    ఇటీవలే దర్శకుడిగా పరిచయం

    ఇటీవలే దర్శకుడిగా పరిచయం

    జిబిత్ జార్జ్ వయసు 30 సంవత్సరాలు. ఆయనకు తల్లిదండ్రులు, ఓ సోదరి ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా సినిమా పరిశ్రమలో ఉంటూ వచ్చారు. తాజాగా కొజిప్పర్ మూవీతో దర్శకుడిగా మారారు. ఆయన కెరీర్ ఇక ముందుకు సాగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో అర్ధాంతరంగా ఈ లోకం నుంచి వెళ్లిపోవడం షాక్ గురి చేసింది.

    ఛాతిలో నొప్పి కారణంగా

    ఛాతిలో నొప్పి కారణంగా

    జిబిత్ జార్జ్ శనివారం ఉదయం నుంచి ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. ఆయన ఆ నొప్పిని పట్టించుకోకుండా తేలికగా తీసుకొన్నారు. సాయంత్రం కల్లా నొప్పి తీవ్రతరం కావడం హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా జిబిత్ జార్జ్ కన్నుమూశారు.

     లాక్‌డౌన్ కారణంగా

    లాక్‌డౌన్ కారణంగా

    లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన కొజిప్పోర్ సినిమాతో జిబిత్ జార్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మార్చి 6న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ఉండగానే లాక్‌డౌన్ విధించడంతో సినిమా ప్రదర్శన అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో హీరోయిన్ వీణా నందకుమార్ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రదర్శనలు నిలిపివేయడంతో జిబిత్ మనస్తాపానికి గురైనట్టు సన్నిహితులు తెలిపారు.

    ప్రముఖుల సంతాపం

    ప్రముఖుల సంతాపం

    కొజిప్పోర్ సినిమాను లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత మళ్లీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో దర్శకుడు జిబిత్ జార్జ్ మరణించడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. జిబిత్ జార్జ్ మరణంతో షాక్ తిన్న దర్శకుడు అజయ్ వాసుదేవన్‌తోపాటు పలువురు తన సోషల్ మీడియా అకౌంట్‌లో ప్రగాడ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.

    English summary
    Malayalam film industry went into shock. Young Director Jibit George died due to heart attack. He was 30. He debut with Kozhipporu movie on March 6th. Many celebrities mourns on his death.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X