MSVPG 4 Days Collections: 200 కోట్ల క్లబ్‌లో శంకర వరప్రసాద్.. 4వ రోజు చిరంజీవి మూవీకి ఎన్ని కోట్లంటే?
మన శంకర వరప్రసాద్ గారు సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాల్లో టాక్. చిరంజీవితోపాటు ఈ సినిమా స్టార్ వాల్యూ, అనిల్ రావిపూడి సక్సెస్ ట్రాక్ కూడా బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగేందుకు దోహదపడింది. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ 31 కోట్ల రూపాయలు, సీడెడ్ 18 కోట్లు, ఉత్తరాంధ్ర 14 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 9.5 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లా 7.2 కోట్ల రూపాయలు, గుంటూరు 9 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 7.25 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లా హక్కులు 4.25 కోట్ల రూపాయల మేర బిజినెస్ వాల్యూ కట్టారు అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక కర్ణాటక రైట్స్ 8 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల రైట్స్ 2 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 20 కోట్ల రూపాయలు మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఏపీ, నైజాంలో 100 కోట్ల రూపాయల బిజినెస్, తెలుగేతర రాష్ట్రాల్లో 10 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల రూపాయలు మేర జరిగింది. దాంతో ఈ సినిమా సుమారుగా 130 కోట్ల రూపాయల మేర బిజినెస్ నమోదు చేసుకొన్నది. 132 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇండియా వైడ్‌గా గత 3 రోజుల సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లో 86 కోట్లకుపైగా గ్రాస్, 58 కోట్లకుపైగా నెట్ కలెక్షన్లను రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం 8.25 కోట్లు, తమిళనాడులో 1 కోటి రూపాయలు, కేరళలో 10 లక్షలు, నార్త్ ఇండియాలో 1.75 కోట్లు వసూలు చేసింది. 96 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రా, నైజాంలో గత 3 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 19 కోట్లకుపైగా, సీడెడ్‌లో 8.5 కోట్లకుపైగా, ఉత్తరాంధ్రలో 7.5 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4.5 కోట్ల రూపాయలు, గుంటూరులో 5.5 కోట్ల రూపాయలు, కృష్ణా జిల్లాలో 4.5 కోట్ల రూపాయలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక నాలుగో రోజు ఈ సినిమా భారీగా కలెక్షన్లను నమోదు చేసింది. పండుగ సెలవుల్లో ఈ మూవీకి ప్రేక్షకులు పోటెత్తారు. ఈ చిత్రానికి సుమారుగా 25 కోట్ల రూపాయలు నెట్ వసూళ్లు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ఇండియా వైడ్ 121 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు నమోదు అయ్యాయి. నార్త్ అమెరికాలో నాలుగు రోజుల్లో ఈ సినిమా 2.2 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి.
మన శంకర వరప్రసాద్ సినిమా కలెక్షన్ల గురించి నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా గత 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 190 కోట్ల రూపాయలు వసూలు చేసింది. విడుదలైన ప్రతీ చోట బ్రేక్ ఈవెన్ సాధించేందుకు పరుగులు పెడుతున్నది. పబ్లిక్ నుంచి భారీ డిమాండ్ వస్తుండటంతో అదనంగా స్క్రీన్లను యాడ్ చేస్తున్నాం. ఈ సంక్రాంతికి సినిమాల్లో ఎక్కువ మంది ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు అంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ చిత్రం 5వ రోజున 200 కోట్ల మార్క్ దాటి మరో సంచలనాన్ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











