twitter

    విమర్శకుల సమీక్ష

    • కలవటం..విడిపోవటం..పొందటం అనే రెగ్యులర్ రొమాంటిక్ బీట్స్ కు అణుగుణంగానే సుకుమార్ స్క్రిప్టు తయారుచేసుకుని ఈ సారి తాను కన్ఫూజ్ కాకుండా ప్రేక్షకుడ్ని కన్ఫూజ్ కాకుండా కాపాడాడు. అలాగే తన స్పెషలైజేషన్ అయిన క్యారెక్టర్ డ్రైవన్ ఫిల్మ్ గానూ మరో ప్రక్క ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది ఆయన అభిమానులును సంతృప్తి పరిచాడు. ఫస్టాఫ్ కాలేజి యువతకు నచ్చితే సెకెండాఫ్ ఫ్యామిలీలకు పట్టేలా కనపడుతోంది. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ వద్ద నాగచైతన్య బరస్ట్ అయ్యి తన ప్రేమను వ్యక్తం చేసే సీన్ చాలా బాగా వచ్చింది. హీరో తాతగా చేసిన విజయ్ కుమార్ పాత్ర బాగా కథలో కలిసి క్లైమాక్స్ కు లీడ్ చేయటం చాలా బాగా వచ్చింది. ఆయన పాత్ర కథలో కీలకమవ్వటం సుకుమార్ స్క్రిప్టుపై చేసిన కసరత్తు ఫలితమే అనిపిస్తుంది. అంతేగాక హీరో పాత్ర చివరదాకా తన క్యారెక్టేరషన్ ని వదలకుండా నిలబెట్టడం కూడా బాగా నచ్చే అంశం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X