twitter

    విమర్శకుల సమీక్ష

    • తొలిభాగంలో సునీల్‌కు డబ్బు పిచ్చి ఎంత ఉందనే కోణాన్ని చూపించడంతో కథ ప్రారంభమవుతుంది. సునీల్ పైసల కోసం ఎంతకైనా తెగిస్తాడనే విషయాన్ని ఆవిష్కరించడానికి రాజకీయాలు, ఇతర అంశాలతో కథ చాలా నిస్సారంగా సాగుతుంది. సునీల్ తరహా రొటీన్ కామెడీ, పంచులతో వ్యవహారమంతా చాలా సాదాసీదా మారుతుంది. ఇక భార్యభర్తల మధ్య కలహాలు అనే చిన్న పాయింట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్‌ కార్డు పడుతుంది. ఆ తర్వాత కథ అమెరికాకు చేరుతుంది. అమెరికాలో వివాహ సంబంధాలు, యాంత్రిక జీవితాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఇక రెండో భాగంలో 30 నిమిషాల అనంతరం అసలు కథ ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి కథపై, సన్నివేశాలలో ఉండే భావోద్వేగాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. ప్రీక్లైమాక్స్ ప్రేక్షకులను కొంత ఎమోషనల్ పాయింట్లను టచ్ చేస్తుంది. భార్యభర్తలు ఒక్కటయ్యే రొటీన్ క్లైమాక్స్‌తో ముగింపు కార్డు పడుతుంది.

      2 కంట్రీస్ విషయానికి వస్తే ఫస్టాఫ్ మైనస్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌‌లో అమెరికాలో తెరకెక్కించిన సన్నివేశాలు కథకు బలాన్ని ఇచ్చేలా ఉంటాయి. కథలో ఉండే భావోద్వేగాన్ని చక్కగా తెరకెక్కించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ప్రేక్షకుల సహనం, ఓపికకు పరీక్ష తారాస్థాయికి చేరుకోవడం వల్ల సినిమాపై పట్టు సడలినట్టు అనిపిస్తుంది. ఏది ఏమైనా కథలో ఉండే మంచి పాయింట్‌ను ఆసక్తికరంగా మలచకపోవడమనేది ఈ చిత్రానికి ప్రధానలోపం అనేది మెజారిటి ప్రేక్షకుల అభిప్రాయం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X