twitter
    TelugubredcrumbMoviesbredcrumb90MLbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఓ సినిమా ప్రేక్షకుల మదిలోకి నేరుగా వెళ్లాలంటే.. సరికొత్త పాయింట్‌తో వారి ముందుకు వెళ్లాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. మూడు పూటల మందు లేనిదే బతకని కుర్రాడు.. మందు అంటేనే పడని ఫ్యామిలీకి లింక్ పెట్టిన రాసుకున్న పాయింట్ ఈ సినిమాను ముందుకు నడిపించింది. ప్రేక్షకుల్లో అంచనాలను పెంచింది. ఆ అంచనాలు అందుకోవడంలో దర్శకుడు కూడా విజయం సాధించాడనే చెప్పవచ్చు. అయితే ఈ కొత్త పాయింట్‌కు పాత కథనాన్ని ఎంచుకోవడం కాస్త నిరాశ కలిగించే విషయం. అయినా సరే ప్రేక్షకుడిని ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా కథ నడపడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తోంది. దర్శకుడిగానే కాకుండా తన మాటలతో కూడా ఆకట్టుకున్నాడు. ‘నా అలవాటు చెడ్డదేమో కానీ నేను చెడ్డవాన్ని కాదు', ‘కొడితే చచ్చే ప్రేమ కాదు.. చంపినా చావని ప్రేమ' లాంటి డైలాగ్‌లో ఉన్న ఎమోషన్ ఆకట్టుకుంది. ఈ రకంగా మొదటి ప్రయత్నంలోనే శేఖర్ రెడ్డి యెర్రా దర్శకుడిగా, రచయితగా విజయం సాధించాడని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X