twitter
    TelugubredcrumbMoviesbredcrumbAdirindhibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • సేవ కోసం కాకుండా పక్కా బిజినెస్‌గా మారిన వైద్య వృతిపై దర్శకుడు సంధించిన సినీ విమర్శనాస్త్రం మెర్సల్ చిత్రం. వైద్య రంగంలో జరిగే కమీషన్ల దందా, ప్రైవేట్ హాస్పిటల్స్ దందాను దర్శకుడు అట్లీ కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఈ రకమైన కథకు హృదయాన్ని పిండి వేసే సన్నివేశాలను బలంగా రాసుకోన్నాడు. సినిమా తొలి భాగంలో యాక్సిడెంట్ గురైన ఓ బాలిక ఎపిసోడ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టించేతగా ఉంది. డబ్బుకు ఆశపడి కొందరు వైద్యులు చేసే దుర్మార్గాలను పచ్చిగా చూపించాడు. విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ సన్నివేశాలు తెరపై అద్భుతంగా ఉంటాయి. ప్రతీ పది నిమిషాలకు ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి.

      ఓ గ్రామ పెద్ద వెట్రి మారన్ (విజయ్) కథ ఫ్లాష్ బ్యాక్‌తో ఆరంభమవుతుంది. పేదల కోసం పరితపించే వెట్రీ మారన్ క్యారెక్టర్ చక్కగా డిజైన్ చేశాడు. ఇక వెట్రీ మారన్ భార్య (నిత్యమీనన్) నటన సెకండాఫ్‌కు ప్రాణం పోసింది. గర్భవతి అయిన నిత్య మీనన్ వైద్యుల దుర్మార్గానికి గురై ప్రాణాలు కోల్పోయే ఎపిసోడ్ సినిమాకు హైలెట్. వెట్రీ మారన్ చనిపోయే ఎపిసోడ్‌లో యాక్షన్ పార్ట్ అద్భుతంగా చిత్రీకరించారు. ఎమోషనల్‌గా సాగే కథలో ప్రతీ సన్నివేశం సినిమాను మరో మెట్టును ఎక్కించే విధంగా ఉన్నాయి. చక్కటి స్క్రీన్ ప్లేతో దర్శకుడు తన ప్రతిభ ఆకట్టుకునేలా ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X