twitter

    అదిరింది స్టోరి

    అదిరింది సినిమా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ అందించారు. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు ఇది యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్, సమంత, కాజల్ అగర్వాల్, నిత్య మీనన్, ఎస్ జె సూర్య, సత్యరాజ్, వడివేలు, సత్యన్, మిషా గోషల్, కోవై సరళ, యోగి బాబు, హరీష్ పెరడి, రాజేంద్రన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం అట్లీ వహిస్తున్నారు మరియు నిర్మాత రామసామి ఎన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించారు. 

    కథ

    డాక్టర్ మారన్ (విజయ్) నిస్వార్థపరంగా వైద్య వృత్తిని కొనసాగిస్తుంటాడు. కేవలం ఐదు రూపాయలకే వైద్యం అందిస్తుంటాడు. వెట్రి (విజయ్) పాపులర్ మెజిషియన్. డాక్టర్ మారన్ అందించిన అత్యుత్తమ వైద్య సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ దేశం అవార్డు ప్రకటిస్తుంది. ప్యారిస్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకొంటాడు. అదే సమయంలో వెట్రీ మ్యాజిక్ ప్రదర్శన ప్యారిస్‌లో జరుగుతుంది. మ్యాజిక్ ప్రదర్శనలో భాగంగా ప్రపంచ గుర్తింపు పొందిన డాక్టర్‌ను వెట్రీ చంపి పగ తీర్చుకొంటాడు. డాక్టర్‌ను చంపిన వెట్రీ కూడా మారన్ మాదిరిగా ఉండటంతో మారన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మారన్ అరెస్ట్‌ను చూసి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన డేనియల్ (ఎస్‌జే సూర్య) కంగుతింటాడు. ఆ తర్వాత మారన్‌ను చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు. మారన్‌ను డేనియల్ ఎందుకు చంపాలనుకొంటాడు? మారన్‌ను చూసి భయపడాల్సిన అవసరం డేనియల్ ఎందుకు ఏర్పడింది. ఇక ఈ కథకు కాజల్ అగర్వాల్, సమంత, నిత్యమీనన్ ఏ విధంగా తోడ్పాడ్డాడు అనే విషయాలకు సమాధానమే మెర్సల్ చిత్రం.
    **Note:Hey! Would you like to share the story of the movie అదిరింది with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X