twitter

    విమర్శకుల సమీక్ష

    • ఆల్రెడీ తెలుగులో వచ్చిన అనేక సినిమా కథలు కలిపి వండినట్లున్న ఈ చిత్రం కథ గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు. ముఖ్యంగా సెకండాఫ్ ప్రారంభంలో ప్లాష్ బ్యాక్ పూర్తి కాగానే... విలన్ ని డెన్ లో కట్టేయటంతోనే...కథలో కాంప్లిక్ట్ అనేదే లేకుండా పోయి బోర్ ప్రారంభమైంది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో(విలన్, హీరో గేమ్ గల) విలన్ లేకుండా కథను ఎంత కామెడీగా నడిపినా పండదనే విషయం ఎందుకనే మర్చిపోయారు. విలన్ ఏక్టివేట్ అయ్యే దాకా ఆ సీన్ లు అన్నీ వృధాగా మారిపోయాయి. విలన్ ఏక్టివేట్ అవ్వగానే దాదాపు సినిమా క్లైమాక్స్ కు వచ్చేసి, ఫైట్ తో ముగింపుకు వచ్చేసింది.

      అలాగే కమర్షియల్ సినిమా కదా అనుకున్నారేమో లాజిక్ లు ఎక్కడా పట్టించుకోలేదు. కరెంట్ షాక్ లు ఇస్తూ మాటా పలుకు లేకుండా పడిపోయిన విలన్ ప్రకాష్ రాజ్ ని లేపటానికి కరెంట్ షాక్ లు ఇస్తూ లేపటానికి ప్రయత్నిస్తూంటే అది జరగదు. తర్వాత ఆ విలన్ కి చెందిన వాళ్లు వచ్చి నీళ్లు కొట్టగానే లేచి కూర్చుంటాడు. అలాగే... హీరో ఎక్కిన ప్లైట్ వెళ్లిపోతూంటే దాన్ని ఆపటానికి ఎయిర్ పోర్ట్ ఛీఫ్...అరుస్తూంటాడు..కానీ పైలెట్ కు ఒక ఫోన్ కొడదామని అనుకోడు. ఇలాంటివి చాలా చిత్రంగా అనిపించే విచిత్రమైన లాజిక్కులు అనేకం ఈ సినిమాలోనే కనిపిస్తాయి. వినాయిక్ లాంటి పెద్ద దర్శకుడు ఆ మాత్రం శ్రద్ద తీసుకోలేదా అనిపిస్తుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X