twitter
    TelugubredcrumbMoviesbredcrumbAmi TumibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • పాత్రల పరిచయం, పాత్ర స్వభావం, ఇతర కథా కమామీషుతో కాలం గడిచిపోతుంది. చాలా రొటీన్‌గా సాగిపోతున్న ఈ కథలో శ్రీ చిలిపి పాత్ర ప్రవేశించిన తర్వాత ఓ జర్క్ వస్తుంది. సాదాసీదాసినిమా సినిమా చూస్తున్నామన్న ప్రేక్షకుడికి కాస్త జోష్ వస్తుంది. శ్రీ చిలిపిగా వెన్నెల కిషోర్ సినిమాకు వెన్నముకగా మారడంతో ఇంటర్వెల్ వరకు కొంచెం ఆసక్తి కలుగుతుంది. తొలిభాగంలో పనిమనిషి కుమారి, శ్రీ చిలిపి మధ్య సీన్లు, శ్రీ చిలిపి, జనార్ధన్ రావు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు, పంచ్‌లు వినోదాన్ని అందిస్తాయి. ఇక రెండో భాగంలో ఇషా రెబ్బా, అడివి శేషు, అవసరాల శ్రీనివాస్, మాయ, వెన్నెల కిషోర్, శ్యామల ఇలా మూడు జంటల మధ్య ప్రేమ వ్యవహారం దర్శకుడు ఎలా క్లైమాక్స్‌ వరకు తీసుకెళ్లాడనేది ప్రధాన అంశం. ద్వితీయార్థంలో కూడా కామెడీకి వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణినే నమ్ముకొన్నాడు. కాకపోతే వారి మధ్య వచ్చే సీన్లలో సత్తా లేకపోవడం, మొదటి నుంచి చివరి వరకు ఓకే తరహాలో డైలాగ్స్, తెర మీద ఇప్పటికే వందలసార్లు చూసిన సీన్లు మళ్లీ ఈ సినిమాలో రిపీట్ కావడంతో సినిమా ఆసక్తికరంగా అనిపించదు. దర్శకుడు ఇంద్రగంటి సినిమాలను చూస్తే ఆరోగ్యకరమైన కత, దాని చుట్టూ హాస్యం, బలమైన సన్నివేశాలు అల్లుపోయినట్టు కనిపిస్తాయి. ఇంద్రగంటి చిత్రాల చాయలు, ఆయన మార్కు టేకింగ్ అమీ తుమీలో ఎక్కడా కనిపించకపోవడం ప్రధాన లోపం.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X