twitter

    విమర్శకుల సమీక్ష

    • దెయ్యం పాత్రలో తాప్సీ ఫర్వాలేదు. అయితే ప్రేక్షకులు భయపడేంత హారర్ మాత్రం ప్రదర్శించలేకే పోయింది. విజయ్ చందర్, రఘు, మరో పిల్ల దెయ్యం కూడా జస్ట్ ఓకే. వాస్తవానికి వారు దెయ్యాలుగా మారక ముందు భయస్తులు. దెయ్యాలుగా మారిన తర్వాత కూడా అదే భయంతో జీవిస్తుంటారు. అందుకే దర్శకుడు వీరిని మరీ అంత భయంకరంగా చూపించలేదని భావించవచ్చు. శ్రీనివాసరెడ్డి, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్, షకలక శంకర్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. గుండె జబ్బున్న పాత్రలో శ్రీనివాస రెడ్డి, సినిమా పిచ్చోడి పాత్రలో షకలక శంకర్, తాగుబోతు పాత్రలో రమేష్, చెవుడు... రేచీకటి పాత్రలో వెన్నెల కిషోర్.......... తమ తమ చేష్టలతో ప్రేక్షకులను బాగా నవ్వించారు.

      కథ అంత గొప్పగా ఏమీ లేదు..... ఓ ఇల్లు, ఆ ఇంట్లో ఉండే మనుషులు, వారి హత్య, తర్వాత దెయ్యాలుగా ఎందుకు మారాల్సి వచ్చింది అనే ఓ కంక్లూజన్‌తో సింపుల్ స్టోరీ సిద్ధం చేసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లేలో ఎక్కడా బోర్ కొట్టకుండా హారర్, కామెడీ జోడించి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించారు. దర్శకుడి పని తీరు ఫర్వా లేదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X