twitter

    విమర్శకుల సమీక్ష

    • కళ్లు వచ్చిన తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన రాజ్ తరుణ్ ఇలా ఎందుకు మర్డర్లు చేయాల్సి వచ్చింది? అందుకోసం ఎలాంటి డ్రామాలు ఆడాడు? ప్రేమించిన నేత్ర కోసం ఆమె తండ్రిని ఎలా మెప్పించాడు? అసలు తన లక్ష్యం ఏమిటీ? హెబ్బా పటేల్‌తో ఏర్పడిన మనస్పర్ధలు ఎలా తొలగిపోయాయి? పందెం బాబ్జీని ఎందుకు చంపాలనుకొంటాడు. ఈ కథలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే అంధగాడు చిత్రం. లవ్, కామెడీ కలిసిన ఈ చిత్రం రివేంజ్ డ్రామా. పగ, ప్రతీకారంతో రగిలిపోయే యువకుడు తన లక్ష్యాన్ని ఎలా నేరవేర్చుకొన్నాడు అనేది చాలా సింపుల్ లైన్. కానీ స్వతహాగా కథా రచయిత అయిన వెలిగొండ శ్రీనివాస్ తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్న రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటను తాను అల్లుకొన్న కథకు హీరో, హీరోయిన్లుగా ఎంచుకొన్నారు. అనాధ అంధులు అనే ఉద్వేగపూరితమైన పాయింట్‌కు కమర్షియల్ హంగులు జోడించడం అభినందనీయం. కానీ కథలో ఇంటెన్సిటీకి తగినట్టు కథనం లేకపోవడం, నిర్మాణ విలువలు నాసిరకంగా ఉండటం ఈ సినిమా వేగానికి ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఫస్టాఫ్‌లో చాలా రొటీన్‌గా సాగిపోతున్న సమయంలో ఇంటర్వెల్ బ్యాంగ్‌లో మంచి ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో కథ రచయితగా, దర్శకుడిగా సఫలమయ్యాడు. ఫస్టాఫ్ అయిన తర్వాత విశ్లేషించుకొంటే క్లైమాక్స్‌లో చెప్పే పాయింట్ కోసం మొదటి భాగాన్ని చాలా నాసిరకంగా చుట్టేశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇచ్చిన ట్విస్ట్‌తో రెండో భాగం ప్రారంభమవుతుంది. గత చిత్రాల్లో రాజ్ తరుణ్‌కు ఉన్న ఇమేజ్, బాడీ లాంగ్వేజిని దృష్టిలో పెట్టుకోవడం మూలాన కథలో ఉండే సీరియస్ పాయింట్‌ను వదిలేసి చివరి వరకు హాస్యంతో దర్శకుడు వెలిగొండ నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రాసెస్‌లో సినిమా గ్రిప్పింగ్ లేకపోవడం, పాటలకు సరైన టైమింగ్ లేకపోవడం, కామెడీ చాలా పేలవంగా ఉండటం వెరసి రొటీన్ సినిమా చూస్తూ ఉన్నామన్న భావన ఏర్పడుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో ఎమోషనల్ పాయింట్‌ను టచ్ చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశాడు. సినిమాను లైన్లోకి తెచ్చాడు అని అనుకునేంతలోనే మళ్లీ రొటీన్ పట్టాలెక్కి హడావిడిగా సినిమాను పూర్తి చేసేందుకు ప్రయత్నించాడు. రాజ్ తరుణ్‌ను కొత్తగా ప్రజెంట్ చేసే సత్తా ఉన్న కథను ఎంచుకొన్న దర్శకుడు.. దానిని ఆచరణలో పెట్టే విషయంలో తడబాటుకు గురయ్యాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్లను ఆనందించే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా చూసుకొంటే కొన్ని సన్నివేశాల్లో కామెడీ బ్రహ్మండంగా పేలింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X