twitter
    TelugubredcrumbMoviesbredcrumbAngelbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అమరావతిలో దొరికిన విగ్రహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తుండగా అది దేవకన్యగా మారడంతో అసలు కథ మొదలవుతుంది. అయితే గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ కథ సామాన్య ప్రేక్షకుడిని కూడా కన్విన్స్ చేసే విధంగా ఆరంభం కాకపోవడం ప్రధానమైన లోపంగా మారింది. తొలి భాగంలోనే అనేక ట్విస్టులతో కథ చాలా చికాకుగా ఉంటుంది. నక్షత్రను పోలిన నందు ఉండటం అనే పాయింట్ వద్ద ఇంటర్వెల్ టైటిల్ పడుతుంది. ఇక రెండో భాగంలో నందు ఫ్యాష్‌బాక్ కథకు రైతుల అంశం జోడించినా ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా లేకపోవడం మరో మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక చివర్లో దెయ్యం, గొలుసు ఎపిసోడ్‌లు నాసిరకంగా ఉండటమే కాకుండా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఈ చిత్ర కథనంలో 80, 90 దశకాలలో వచ్చిన సినిమాల్లో కూడా కనిపించదు. ఏ సన్నివేశంలోనూ ఎక్కడా సహజత్వమే కనిపించదు. అంతా ఆర్టిఫిషియల్‌గానే ఉండి చికాకు పెడుతుంటాయి. వెరసి ఈ చిత్రం కనీస సినిమా ప్రమాణాలకు దగ్గరగా లేదనే అభిప్రాయం కలుగడం చాలా సహజమైన పాయింట్.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X