ఈ సినిమా చూస్తూంటే దర్శకుడుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందనిపిస్తుంది. కథని ఎత్తుకోవటం, సీన్ ల్లో , చెప్పే డైలాగుల్లో సహజత్వానికి ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా చూస్తూంటే వర్మ సూపర్ హిట్ సత్య గుర్తుకు రావటం ఖాయం. అయితే వర్మ తరహా మేకింగ్ ఎన్నో సార్లు మనం చూసిందే కాబట్టి కొత్తగా అనిపించదు...ఆ మార్గాన్ని వదిలి..సొంత మార్గంలో దర్శకుడు ట్రై చేసి ఉండాల్సిందనిపిస్తుంది. శ్రీవిష్ణు, నారా రోహిత్..ఇద్దరూ పోటీ పడి చేసిన సినిమా. ముఖ్యంగా నారా రోహిత్ అయితే షాకిచ్చే ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. అండర్ ప్లేతో తన సీన్స్ ని లేపి కూర్చోబెట్టాడు. శ్రీవిష్ణు అనే హీరో కమ్ ఫెరఫార్మర్ ...ఒకడున్నాడు..అని ఇండస్ట్రీకి ఈ సినిమా ఖచ్చితంగా చెప్తుంది. చాలా సీన్స్ లో శ్రీవిష్ణు అదరకొట్టాడు. మిగతా వాళ్లు బాగా చేసారు.
ఫైనల్ గా ఇది దర్శకుడి కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ చూపించే చిత్రం. రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడేవారు. ఎప్పుడూ అవే కథలా..వీళ్లు మారరా అనుకునేవాళ్లు, తొంభైల్లో మన కలిసి ఉన్న రాష్ట్రంలో పరిస్దితులను, మనకు తెలియని వాటి వెనక దారుణమైన నిజాలను చూడాలి, లేదా గుర్తు చేసుకోవాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆఫ్షన్.