twitter

    విమర్శకుల సమీక్ష

    • ‘అర్జున్ రెడ్డి' పాత్రలో విజయ్ దేవరకొండ సూపర్బ్‌గా నటించాడు. నటనలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్ ఏర్పరచుకున్న విజయ్ ‘అర్జున్ రెడ్డి' పాత్రలో మెప్పించాడు. కోపం కంట్రోల్ చేసుకోలేని సీన్లు, ఎమోషనల్ సీన్లు, సెంటిమెంటల్ సీన్లు దేనికదే సూపర్బ్‌గా చేశాడు. టాలీవుడ్లో విజయ్ దేవరకొండ ఫ్యూచర్లో పెద్ద స్టార్ అవుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ శాలిని పెద్ద అందత్తె కాకపోయినా.... 19 ఏళ్ల ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో బాగా సెట్టయింది. క్యూట్ లుక్ తో, విజయ్ దేవరకొండకు తగిన జోడీగా పేరు తెచ్చుకుంది. అర్జున్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్ శివ పాత్రలో రాహుల్ రామకృష్ణ, సినిమాలో కనిపించే ప్రతినటుడు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

      దర్శకుడు సందీప్ రెడ్డి తొలి సినిమాతోనే మంచి ఇంప్రెషన్ కొట్టేశాడు. అతడు ఎంచుకున్న కథాంశం కామన్ లవ్ స్టోరీనే అయినప్పటికీ దాన్ని నేరేట్ చేసిన విధంగా ప్రేక్షకుడిగా బాగా ఎక్కింది. అక్కడక్కడ కాస్త లాగినట్లు అనిపించినా.... మంచి పనితనం చూపించాడు.

      ‘అర్జున్ రెడ్డి' సినిమా చూస్తుంటే కథ రియల్ లైఫ్‌కు చాలా దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అర్జున్ రెడ్డికి కనెక్ట్ అయిపోతారు. 3 గంటల సినిమా అయినా మొదటి నుండి చివరి వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు స్క్రీన్ ప్లే రన్ చేసిన తీరు బావుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X