బాహుబలి ది కంక్లూజన్‌ (U/A)

పాఠకుల రివ్యూ

విడుదల తేదీ

28 Apr 2017
కథ
బాహుబలి ది కంక్లూజన్ సినిమా బాహుబలి చిత్రానికి కొనసాగింపుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క శేట్టి, రానా దగ్గుబాటి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుదీప్, పృధ్వీ తదితరులు నటించారు. దర్శకుడు ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రోపొందించారు మరియు నిర్మాతలు శోభు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చురు.
 
కథ

కాలకేయ దేశవాసులతో యుద్ధంతోపాటు అనేక విపత్కర పరిస్థితిలో ముందుండి నడిపించిన అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)ను రాజమాత శివగామి దేవి (రమ్యక‌ష్ణ) మహిష్మతీ సామ్రాజ్యానికి పట్టాభిషేకం జరిపించాలని నిర్ణయించుకొంటుంది. పట్టాభిషేకానికి ముందు ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడానికి దేశాటన చేయాలని బాహుబలిని రాజమాత కోరుతుంది. ఈ నేపథ్యంలో కట్టప్ప తోడుగా బాహుబలి దేశాటనకు బయలుదేరుతాడు. ఆ సమయంలో కుంతల దేశ యువరాణి అయిన దేవకన్య (అనుష్క)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తన ప్రేమను దేవసేనకు వ్యక్తం చేస్తాడు. ఇద్దరు ఒక్కటి కావాలని నిశ్చయించుకొని శివగామి వద్దకు వెళ్తారు. అయితే బాహుబలి, దేవసేనకు శివగామికి మధ్య విభేదాలు చోటుచేసుకుంటాయి. కొన్ని పరిస్థితుల మధ్య బాహుబలి దంపతులపై అంతఃపుర బహిష్కర వేటు పడుతుంది. బహిష్కార వేటు పడిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్పి వచ్చింది. అసలు కట్టప్ప ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టాడు? మహిష్మతి సామ్రాజ్యంలో అమరేంద్ర బాహుబలిని చంపించే పరిస్థితి ఎందుకు వచ్చింది. ఆ హత్య వెనుక ఎవరున్నారు? బాహుబలి కుమారుడు మహేంద్ర బాహుబలి తన తల్లి దేవసేనను భళ్లాలదేవ నుంచి ఎలా కాపాడుకున్నాడు? అనే పశ్నలకు సమాధానమే బాహుబలి ది కన్‌క్లూజన్. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu