twitter
    TelugubredcrumbMoviesbredcrumbBalagambredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • చావును కూడా పండుగలా చేసే తెలంగాణలోని మట్టి వాసనను, మట్టి మనుషుల ఎమోషన్స్‌ను చెప్పే సినిమా బలగం. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో చావు సమయంలో ఆచరించే సంప్రదాయాలు, సంస్కృతి తదితర అంశాలు కళ్లకు కట్టినట్టుగా సజీవంగా తెరపైన కనిపిస్తాయి. చరిత్రలో కనిపించకుండా పోతున్న ఒగ్గు కథ, ఒళ్లు పట్టే సీన్లు తెలంగాణ వాసులను తమ జీవితానికి సంబంధించిన గతంలోకి లాక్కెలుతాయి. ప్రతీ పాత్ర మన ఊర్లో పక్కింటిలో కనిపించే మనుషుల్లో ఉండే సహజత్వంతో, భోళాతనం, మొండితనం, పట్టింపులు వాస్తవాలను గుర్తు చేస్తాయి. బలగం సినిమా చూస్తున్నంత సేపు కొన్నేళ్ల క్రితం మన ఊరిలో, మన కుటుంబంలో జరిగిన విషయాలను తిరిగి దర్శనం చేసుకొన్నట్టు అనిపిస్తుంది. పక్కా తెలంగాణ ఎమోషన్స్ పలికించే సినిమా ఆంధ్రాలో ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా అనే ప్రశ్న వినిపించడం ఖాయం. కాకపోతే ఎమోషన్ ఎవరికైనా ఎమోషన్. తెలుగు ప్రజల గుండెను తట్టిలేపే సినిమా బలగం. సినిమా కాదు.. కొన్ని జీవితాలను చూసిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా బలగంతోపాటు వెళ్లి చూడదగిన సినిమా ఇది
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X