twitter

    విమర్శకుల సమీక్ష

    • టైటిల్, హీరోని నమ్ముకుని మనం ధియోటర్ లోకి వెళితే డైరక్టర్ కూడా మనలాగే టైటిల్ ని, ఇంటర్వెల్ బ్యాంగ్ ని నమ్ముకుని సినిమా తీసినట్లు అర్ధమయ్యే చిత్ర రాజం బెట్టింగ్ బంగార్రాజు. బెట్టింగ్ ని టైటిల్ లో మాత్రమే ఉంచి ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్, సెకెండాఫ్ లో కొన్ని సీన్స్ బెట్టింగ్ పై వేసి అదే టైటిల్ జస్టిఫికేషన్ అనుకోమంటాడు. దాంతో మనం ధియోటర్ కి ఏది నమ్ముకుని వెళ్తామో అది దొరకక నిరాసపడి, ఉన్నదాంతో ఎడ్జెస్టై సైలెంట్ గా బయిటకు వస్తాం. దాంతో సినిమా బావుంది అనీ చెప్పలేం...బాగోలేదనీ చెప్పటానికి పూర్తిగా మనస్సు ఒప్పదు. ఎందుకంటే అక్కడక్కడా నవ్వించాడు కదా అనేది ఒకటయితే.. ప్రక్క ధియోటర్లో ఇంత కన్నా చెత్త ఆడుతోంది కదా అని మనలో మనం సమాధానపరుచుకుని మధ్యస్తంగా ఓకే అనేస్తాం. అదే బెట్టింగ్ బంగార్రాజు పరిస్దితి. కథ,కథనంలోనే లోపాలుతో తయారైనా అక్కడక్కడా రఘుబాబు లాంటి క్యారెక్టర్స్ తో నవ్వించి ఫరవాలేనిపించేస్తాడు. గట్టిగా బెట్ కాసి హిట్ అని చెప్పమంటే మొహం చాటేసేలా చేస్తాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X