twitter

    విమర్శకుల సమీక్ష

    • మంత్రి ఈశ్వర ప్రసాద్ (జయకుమార్) నిజాయితీ అయిన రాజకీయవేత్తగా చూపించడం. రైతుల సంక్షేమం కోసం ప్రాణధార అనే ప్రాజెక్ట్‌ను చేపట్టమనే అంశాలతో తొలి భాగం పాజిటివ్ నోట్‌లో ప్రారంభమవుతుంది. రాజకీయాల్లో అవినీతి, వారసత్వ రాజకీయాలను ప్రక్షాళన చేయడం అనే పాయింట్‌తో ఫీల్ గుడ్‌గా సినిమా అనిపిస్తుంది. ఓ వైపు మంత్రి ఈశ్వర ప్రసాద్‌పై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం, ఆయనను ప్రజల నుంచి దూరం చేయడానికి చంచలను రంగంలోకి దించడంతో సినిమా ఓ మలుపు తిరుగుతుంది. భాగమతి బంగ్లాలో జరిగే సంఘటనలు థ్రిల్లింగ్ అనిపిస్తాయి. పలుమార్లు ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిసాయి. అనుష్క టాలెంట్‌ను మరోసారి గుర్తు చేసే విధంగా చక్కటి ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ప్రథమార్థాన్ని ముగిస్తాడు. ఇక రెండో భాగంలో కథ అనేక మలుపు తిరిగి ప్రేక్షకుడిని కొంత గందరగోళంలో పడేస్తాయి. ఊహించిన ట్విస్టులు కంగారు పెట్టిస్తాయి. సినిమా పక్కదారి తప్పుతుందా? దర్శకుడు అశోక్ తడబడుతున్నాడా? అనే సందేహాలు వ్యక్తమైన సమయంలో ఓ సామాజిక అంశాన్ని తెరమీదకు తెచ్చి బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నాయా అనే ఫీలింగ్ కలుగుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X