twitter

    భైరవ గీత స్టోరి

    భైరవ గీత సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ధనుంజయ్, ఇర్రా మోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సిద్దార్థ వహించారు మరియు రామ్ గోపాల్ వర్మ, భాస్కర్ రాశి సంయుక్తంగా నిర్మించారు. 

    కథ
    రాయలసీమలో భూస్వామి సుబ్బారెడ్డి (బాలరాజ్‌వాడీ) వద్ద భైరవ పనిచేస్తుంటాడు. సుబ్బారెడ్డి కూతురు గీత (ఇరా మోర్)ను తొలి చూపులోనే ఇష్టపడుతాడు. ఒకానొక సమయంలో ప్రాణాలను తెగించి ప్రత్యర్థి దాడుల నుంచి గీతను కాపాడటంతో భైరవ అంటే ఇష్టం కలుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో కట్టారెడ్డి (విజయ్ రామ్) అనే ఫ్యాక్షన్ నేతతో గీతకు నిశ్చితార్థం జరుగుతుంది. నిశ్చితార్థ కార్యక్రమంలో కాబోయే భర్తను గీత చెంపపై కొట్టడం, ఆ తర్వాత తండ్రి సుబ్బారెడ్డితో గొడవ పడి భైరవను పెళ్లి చేసుకొంటానని తెగేసి చెబుతుంది.
    తన కూతుర్ని బుట్టలో వేసుకొన్న భైరవను అంతమొందించడానికి ప్లాన్ చేస్తాడు. ఆ క్రమంలో భైరవ, గీత పారిపోతారు. పారిపోయిన భైరవ, గీత‌లకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? భైరవ నుంచి సుబ్బారెడ్డికి ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. బానిస బతుకు నుంచి విముక్తి కావడానికి భైరవ ఎలాంటి పోరాటం చేశాడు. సుబ్బారెడ్డి, కేశవరెడ్డి, (భాస్కర్ మన్యం), కట్టారెడ్డి ఆగడాలకు ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే భైరవ గీత.
    **Note:Hey! Would you like to share the story of the movie భైరవ గీత with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X