బ్రహ్మోత్సవం (2016)(U)
Release date
20 May 2016
genre
బ్రహ్మోత్సవం స్టోరి
బ్రహ్మోత్సవం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, సమంత, కాజల్ అగర్వల్, ప్రణిత, సత్యరాజ్, జయసుధ, రావు రమేష్, తనికెళ్ళ భరణి, నరేష్, రేవతి మినన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లురు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకుర్చరు.
కథ
సత్యరాజ్ పెద్ద ఇండస్ట్రిలియస్ట్. ఆయన ఎంత గొప్పవాడంటే తన మామగారు ఇచ్చిన నాలుగు వందలు రూపాయలను వ్యాపారంలో పెట్టి ఇప్పుడు నాలుగు వందల కోట్లు చేసాడు. ఎప్పుడూ కుటుంబంలో ఏదో ఒక ఉత్సవం చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ ని ఆనందంగా ఉంచటానికి ట్రై చేస్తూంటాడు. ఆయనకు నలుగు బావమరుదులు. వారందరూ కలిసే ఉంటూంటాడు. ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుకుందాం అనే ఆయనకు ఒక కొడకు (మహేష్ ) . మహేష్ కూడా తండ్రి ఫిలాసఫీనే వంటబట్టించుకుంటాడు. అయితే ఈ బావమరిదులలో ఒకరైన రావు రమేష్ కు ఐడింటెటీ క్రైసిస్ ఉంటాయి. ఎంతసేపూ బావ నీడలోనే బ్రతకాల్సి వస్తోందనే బాధ ఉంటుంది. సర్లే...తన కూతురు(ప్రణీత)ను ఒక్కగానొక్క కొడుకు,వారసుడు అయిన మహేష్ కు ఇచ్చి ఆ బాధ ను మరిచిపోదామనుకుంటే...మహేష్ వేరే అమ్మాయి(కాజల్) తో ప్రేమలో పడతాడు. దీంతో మండిన రావు రమేష్ ఆ కుటుంబంతో సంభందం తెంచుకోవాలనుకుని నోటికొచ్చినట్లు మాట్లాడి బావ సత్యరాజ్ ని నొప్పిస్తాడు. దాంతో ఆయన బాధపడి, ఆ బాధలోనే తుది శ్వాస విడుస్తాడు. అయితే సత్యరాజ్ చనిపోయేముందు కొడుకు మహేష్ కు ఓ మాట చెప్తాడు. దాంతో మహేష్ తన కుటుంబ ఏడు తరాలను కలవాలని బయిలు దేరతాడు. ఆ క్రమంలో మహేష్ ఏం చెసాడు. తిరిగి తన మామయ్య రావు రమేష్ తో ఎలా ఒకటయ్యాడు...సమంత ఎవరు...తండ్రి సత్యరాజ్ అసలు ఏం చెప్పాడు మహేష్ కు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...
**Note:Hey! Would you like to share the story of the movie బ్రహ్మోత్సవం with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు