బ్రాండ్ బాబు (2018)(U)
Release date
03 Aug 2018
genre
బ్రాండ్ బాబు స్టోరి
బ్రాండ్ బాబు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రభాకర్ పి వహించారు మరియు నిర్మాత ఎస్ శైలేంద్ర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం బేబి అందించారు.
కథ
బ్రాండెడ్ వస్తువులు వాడాలన్న మహా పిచ్చి కలిగిన బిజినెస్ మాగ్నెట్ రత్నం ( మురళీశర్మ). తన ఇంట్లో వాళ్లతోపాటు కుమారుడు డైమండ్ రత్నం (సుమంత్ శైలేంద్ర)ను కూడా అలానే తయారు చేస్తాడు. తండ్రి మాదిరిగానే విలాసవంతమైన బ్రాండ్ వారే మనుషులు అనే ఫీలింగ్‌లో ఉంటాడు డైమండ్. ఈ క్రమంలో హోంమంత్రి ఇంట్లో పనిచేసే పేదింటి అమ్మాయి రాధ (ఇషా రెబ్బా)తో ఓ విచిత్రమైన కారణంగా పరిచయం జరుగుతుంది. రాధను హోమంత్రి కూతురు అని భ్రమపడిన డైమండ్ ఆమెను ప్రేమించడం మొదలుపెడుతాడు. తీరా నిశ్చితార్తం వరకు వచ్చే సరికి రాధ హోంమంత్రి కుమార్తే కాదని తెలుసుకొని డైమండ్‌తోపాటు తండ్రి రత్నం షాక్ తింటారు. రాధ హోంమంత్రి కూతురు కాదని తెలుసుకోని బ్రాండెడ్ వ్యక్తి కాదన్న నెపంతో పెళ్లి క్యాన్సిల్ చేస్తారు. పేదవారిని, మధ్య తరగతి వారిని మనుషులే కాదన్న దృష్టితో డైమండ్, రత్నం చూడటం వివాదంగా మారుతుంది. పేదవారిని కించపరిచే విధంగా మాట్లాడిన రత్నం కుటుంబంపై పేదలు సంఘ బహిష్కరణ విధిస్తారు?
**Note:Hey! Would you like to share the story of the movie బ్రాండ్ బాబు with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు