twitter

    విమర్శకుల సమీక్ష

    • విజువల్ గా,లాజికల్ గా బాగా ఉండేలా చూసుకున్న దర్శకుడు ఎందుకనో సినిమా ఆడాలంటే ఎమోషన్ కూడా మిక్స్ అవ్వాలనే విషయం మర్చిపోయాడు. ఎక్కడో చోట మన గుండెని తడమటమో, లేక మన జీవితంలో ఇలాగే జరిగిందో, లేక ఇలా జరిగితే బాగుండునో అనిపించకపోతే లవ్ స్టోరీకు నిండుతనం రాదు. రొమాంటి కామెడీలో సైతం విడిపోవటం, పొందటం అనే రెండు విభాగాలు చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దాలని చెప్తూంటారు. ఎందుకనో అనుభవమున్న స్క్రిప్టు రైటరైనా వేమారెడ్డి ఆ విషయం మర్చిపోయి...కేవలం స్టోరై లైన్ లో నావల్టీ మాత్రమే చూసుకున్నారు.

      ఫైనల్ గా... సుమంత్ అశ్విన్ గత చిత్రం లవర్స్ లాంటి ఎత్తుగడను గుర్తు చేసే ఈ చిత్రం...ఆ చిత్రం విజయానికి సప్తిగిరి చేసిన అల్లరి కామెడీనే ప్రధాన కారమనే విషయం మర్చిపోయినట్లున్నారు. దాంతో ఈ చక్కలిగింత మనకు ఏ మాత్రం కొంచెం కూడా గిలిగింతలు పెట్టలేదు. టార్గెట్ చేసిన యూత్ కు కూడా కనెక్టు అవటం కష్టమే అనిపిస్తోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X