చెలియా (2017)(U)
Release date
07 Apr 2017
genre
చెలియా స్టోరి
చెలియా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ ఇది తమిళ్ లో 'కాట్రు వెలియిదై' ఈ చిత్రాన్ని తెలుగులో 'డ్యాయెట్' అనే పేరును ఖరారుచేశారు ఇందులో నటిస్తున్నవారు కార్తీక్ శివకుమార్, అదితి రాయ్, శ్రద్దా శ్రీనాథ్, రుఖ్మిణి విజయకుమార్, ఆర్ జె బాలాజి, డిల్లీ గణేష్, హరీష్ రాజ్, విపిన్ శర్మ తదితరులు. ఈ సినిమాకి కథ - స్క్రీన్‌ప్లే- దర్శకుడు-: మణి రత్నం నిర్వహించారు మరియు ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. ఆస్కార్ విజేత ప్రఖ్యాత సంగీతకారుడు ఎ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి స్వరాలు సమకుర్చరు.
కథ
వరుణ్ అలియాస్ వీసీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వాడ్రన్ లీడర్. ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడిన వరుణ్‌ను అధికారులు హాస్పిటల్లో చేర్చుతారు. అక్కడ డ్యూటీ డాక్టర్‌గా అప్పుడే విధుల్లో చేరిన లీలా అబ్రహం ఆయనకు చికిత్స అందిస్తుంది. ఆ సమయంలో లీలాను చూసి ఇష్టపడుతాడు. ఆ తర్వాత మారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. తమ ప్రేమలో కలతలు, కలహాలు చోటుచేసుకొంటాయి. ఈ సందర్భంలో వారిద్దరూ విడిపోతారు. అదే సమయంలో యుద్ధం చోటుచేసుకోవడంతో ఫైటర్ పైలట్‌గా తన కర్తవ్యాన్ని నిర్వహించేందుకు కార్గిల్‌కు వెళుతాడు. యుద్ధంలో విమానం కూలి పాకిస్థాన్ సైన్యానికి బందీగా చిక్కుతాడు. రావల్పిండి జైలులో వరుణ్ తన ప్రేమికురాలు లీలా అబ్రహం గురించి తలుచుకొంటూ బతుకుతుంటాడు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వరుణ్ పాకిస్థాన్ జైలు నుంచి బయటపడ్డాడా? తన ప్రేమికురాలు లీలాను కలుసుకొన్నాడా? చివరికి కథకు ముగింపు ఏంటనే ప్రశ్నలకు సమాధానమే చెలియా చిత్రం.
**Note:Hey! Would you like to share the story of the movie చెలియా with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు