twitter
    TelugubredcrumbMoviesbredcrumbDangalbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • అమీర్ ఖాన్ మరోసారి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్నాడు. యంగ్ రెజర్‌గా, మధ్య వయసు తండ్రి పాత్రలో జీవించాడు. రెండు పాత్రలకు అనుగుణంగా తన శరీరాన్ని మలచుకుని అదరగొట్టాడు. ఇందుకోసం అమీర్ ఖాన్ కొన్ని నెలల పాటు శ్రమించాడు. దేశానికి గోల్డ్ మెడల్ అందించాలనే పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు. మహవీర్‌సింగ్‌ కూతుళ్లు గీతా ఫోగట్‌గా ఫాతిమా, బబితా కుమారీ పాత్రలో సాన్యా మల్హోత్ర మెప్పించారు. టీవీ నటి సాక్షి తన్వార్ ఇందులో అమీర్ ఖాన్ భార్య పాత్రలో కనిపించి తనదైన నటనతో మెప్పించారు. గతంలో 'చిల్లార్ పార్టీ','భూత్నాథ్ రిటర్న్స్' వంటి సినిమాలు తీసిన అనుభవం ఉన్న నితీష్ తివారీ.... దంగల్ మూవీ కథను, అందులోని భావోద్వేగాల ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా కాస్త స్లోగా ఉన్నా ప్రేక్షకుడి ఆకట్టుకుంటుంది. ప్రీతమ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సినిమా నిర్మాణ విలువలు ఇలా టెక్నికల్ విభాగ అంతా పర్ ఫెక్టుగా ఉంది.

      ఓవరాల్‌గా చెప్పాలంటే... సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ మాత్రమే కాదు... క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X