దంగల్ (2016)
Release date
23 Dec 2016
genre
దంగల్ స్టోరి
దంగల్ (యుద్దం) సినిమా లెంజడరీ రెజ్లర్ మహావీర్ పోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ఇందులో అమీర్ ఖాన్, సాక్షి తన్వార్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, జైరా వసీమ్, సుహానీ బట్నాగర్, గౌతమ్ గులాటి, అపర్ శక్తి ఖుర్రన, రాజ్ కుమార్ రావు, విక్రమ్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నితేశ్ తివారీ నిర్వహించారు మరియు నిర్మాతలు అమీర్ ఖాన్, సిద్దార్థ్ రాయ్ కపూర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రీతమ్ చక్రవర్తి స్వరాలు సమకుర్చరు.
కథ
మహవీర్ సింగ్ ఫోగట్(ఆమిర్‌ఖాన్) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రెజ్లర్. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. తన కల నెరవేరక పోవడంతో తనకు పుట్టబోయే కుమారుల ద్వారా అయినా అది నిజం చేయాలని భావిస్తారు. అయితే ఆయన భార్య శోభా కౌర్(సాక్షి తన్వార్) నాలుగు సార్లు ఆడపిల్లలనే ప్రసవిస్తుంది. తన కల నిజం కాదని డీలా పడిపోయిన ఫోగట్... అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్(ఫాతిమా), బబిత కుమారీ(సాన్యా మల్హోత్ర) బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతారు. వారిని రెజ్లర్లుగా తీర్చిదిద్ది తన కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం వారికి తానే స్వయంగా కఠోర శిక్షణ ఇస్తాడు. మరి మహవీర్ సింగ్ ఫోగట్ కల నెరవేరిందా? లేదా? అనేది అనేది తెరపై చూడాల్సిందే.
**Note:Hey! Would you like to share the story of the movie దంగల్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు