twitter

    విమర్శకుల సమీక్ష

    • హీరోగా తొలి పరిచయం అయినప్పటికీ అశోక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా ఫర్వాలేదు. హీరోయిన్ ఇషా అందంగా కనిపించడంతో పాటు నేచురల్‌గా నటించింది. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ‘దర్శుకుడు' కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం రాసుకున్న కాన్సెప్టును ఉన్నది ఉన్నట్లుగా దించేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు ఎక్కింది, వాళ్లకు నచ్చిందా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తే మాత్రం కాస్త తేడా కొట్టిందనే ఆలోచన కలుగుతుంది. సినిమా కాన్సెప్టు కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. స్లో నేరేషన్, చాలా చోట్ల సీన్లు రిపీటైన ఫీలింగ్ రావడంతో కాస్త బోర్ అనిపిస్తుంది. సినిమాలో రెండు మూడు చోట్ల ట్విస్టులున్నా ప్రేక్షకులను అంత ఎగ్జైట్ చేయలేక పోయాయి.


      సినిమాలో ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వడం కూడా మైనస్సే. ఎంటర్టెన్మెంట్ అంటే మధ్య మధ్యలో ప్రక్షకులను నవ్వించడానికి కామెడీ కావాలని ఇరికించడం అనే ఉద్దేశ్యం కాదు. ప్రేక్షకుడు బోర్ ఫీలవ్వకుండా, ప్రతి సీనూ ఎంజాయ్ చేసేలా, ఆస్వాదించేలా సినిమా రన్ చేయడమే. ఇది ఈ సినిమాలో మిస్సయిందనే చెప్పాలి. సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే... హీరో అశోక్ సినిమాకు మైనస్ కాదు, అలా అని ప్లస్సూ కాదు. తన పాత్రకు న్యాయం చేశాడంతే. హీరోయిన్ ఈషా ప్లస్ ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రపీ ప్లస్, సాయి కార్తీక్ సంగీతం జస్ట్ ఓకే. డైలాగులు బావున్నాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X