ఫస్టాఫ్ లో హీరో తన శత్రువుని ఎంచుకొని, అతని డెన్లోకి అడుగుపెట్టే సన్నివేశాలతో తీర్చిదిద్దారు. సెకండాఫ్ అంతా విలన్ కి, హీరోకి మధ్య మైండ్‌గేమ్‌తో సాగుతుంది. అయితే ధ్రిల్లర్ ఎలిమెంట్స్ ని పేర్చుకునే ప్రాసెస్ లో చాలా చోట్ల ఫీల్ మిస్సంది. అరవింద్ స్వామి క్యారక్టర్ ఎంటర్ అయ్యేదాకా సినిమా స్పీడు ఎత్తుకోదు. అయితే సురేందర్‌రెడ్డి సాంకేతికంగా సినిమాని తనదైన శైలి స్టైలిష్ మేకింగ్‌తో తీర్చిదిద్దారు. ‘అష్టదిగ్బంధనం' కాన్సెప్ట్‌ను బాగా ప్లాన్ చేశారు.దానికి థియోటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా మాత్రం మంచి యాక్షన్ థ్రిల్లర్‌ని చూసిన అనుభూతికి గురిచేస్తుంది.
ఇలాంటి సినిమాల్లో కామెడీని ఆశించటం పద్దతి కాదు కానీ, అలవాటు పడిపోయిన ప్రాణాలు..రిలీఫ్ కోసం...కామెడీ కోసం తపిస్తూంటాయి. తెలుగు సినిమా అంటే...కథతో,సీన్స్ తో సంభందం లేకుండా ఫైట్స్, టెన్షన్ ఎలిమెంట్స్ వచ్చాక ఖచ్చితంగా కామెడీ రావాలనే వారికి ఈ సినిమా నిరాశపరుస్తుంది. అయితే దర్శకుడు ఆ లోటుని పూడ్చాలని పోసాని తో కొంత ట్రై చేసాడు.