twitter

    డైనమైట్ స్టోరి

    డైనమైట్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, ప్రణిత, జె డి చక్రవర్తి, జయప్రకాష్ వి, యొగ్ జపీ, రాజ రవింద్ర తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం దేవ కట్ట నిర్వహించారు మరియు నిర్మాత మంచు విష్ణు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు. 

     కథ

    భాధ్యతగల పౌరుడుగా అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ఈ తరం కుర్రాడుశివాజీకృష్ణ అలియాస్ శివ(మంచు విష్ణు). అతను ఓ రోజు రోడ్డుమీద ఓ అమ్మాయిని పోకిరీలనుంచి రక్షించి, అనామిక దాసరి(ప్రణీత)దృష్టిలో పడతాడు. ఆమె చాలా ఇంప్రెస్ అయ్యి...అతనితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ తర్వాత రెస్టారెంట్ లో కలుసుకుని, ఆమె ప్లాట్ కు వెళతారు. అక్కడ ఆమె రిఫ్రెష్ అవుతున్నప్పుడు ఆమె కిడ్నాప్ కు గురి అవుతుంది. వెంటనే ఎలర్టైన శివ..వెంటనే పోలీసులుకు ఇన్ ఫార్మ్ చేసినా ఫలితం లేకపోవటంతో తనే రంగంలోకి దిగి ఆమెను వెతకటం మొదలెడతాడు. ఆ క్రమంలో ఆమె ఛానెల్ 24 సీఈవో రంగనాధ్ దాసరి (పరుచూరి వెంకటేశ్వరరావు)కూతురు అని తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లి ఆమె తండ్రిని విషయం ఏంటి అని అడుగుదామనుకునేలోపు ఆయన హత్యకు గురి అవుతాడు. అక్కడ కొన్ని విషయాలు రివీల్ అవుతాయి. అసలు ఈ కిడ్నాప్ కు, ఆమె తండ్రి హత్యకు అసలు కారణమేంటి..దీనికి యూనియన్ మినిస్టర్ రిషిదేవ్ (జెడి చక్రవర్తి) కి సంభంధం ఏమిటి... ఎలా ఈ విషయాలన్నీ సామాన్యుడైన శివ ఇన్విస్టిగేట్ చేసి తెలుసుకుని, ఆమెను ఎలా రక్షించాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

     

     

    **Note:Hey! Would you like to share the story of the movie డైనమైట్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X