twitter

    ఎక్కడికి పోతావు చిన్నవాడా స్టోరి

    ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నికిల్ సిద్దార్థ, హెబ్బ పటేల్, నందిత, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి అనంద్ నిర్వహించారు మరియు నిర్మాత పి వి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చురు.

    కథ

    ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన అర్జున్ (నిఖిల్) తన ఎగ్జామ్స్ పూర్తి చేసిన వెంటనే తను ప్రేమించిన అమ్మాయి ఆయేషాను పెళ్లి చేసుకోవటానికి రిజిస్టర్ ఆఫీసుకు బయిలుదేరతాడు. స్నేహితులతో అక్కడికి వెళ్లిన అతనికి ఎంతసేపు ఎదురుచూసినా ఆమె రాదు. దాంతో అతనికి ఏం చేయాలో అర్దం కాదు. అవతల ఆయేషా పోన్ ఎత్తడు. చివరకు నిరాశతో ఇంటికి వెళ్లిపోతాడు. జీవితంలో ఇంకెవరి కోసం ఎదురూచూడకూడదని ఫిక్స్ అవుతాడు. కాలగమనంలో ఆయేషాను మర్చిపోయి...గ్రాఫిక్స్ డిజైనర్ గా సెటిలవుతాడు. బాహుబలి 2 కు గ్రాఫిక్స్ చేస్తున్న అతను తప్పనిసరి పరిస్దితుల్లో కేరళ లలోని మహిషాసుర మర్దిని ఆలయానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకూ అంటే...తన ప్రెండ్ కిషోర్‌ (వెన్నెల కిషోర్‌)ని పట్టిన దెయ్యాన్ని వదిలించడానికి. ప్రెండ్ కోసం కేరళలోని మహిషాసురమర్థిని ఆలయానికి వచ్చిన అర్జున్ కు .... అక్కడ అమల (హెబ్బా పటేల్‌) పరిచయం అవుతుంది. కేరళలో ఉన్న నాలుగు రోజుల్లోనూ అర్జున్‌, అమల బాగా దగ్గరవుతారు. ఇంక తెల్లారితే ప్రేమిస్తున్నానే విషయం చెప్తుంది అనుకున్న సమయంలో .. సడన్‌గా అర్జున్‌కి చెప్పకుండా తన సొంత వూరు విజయవాడ వెళ్లిపోతుంది అమల. అమల ని వెతుక్కొంటూ విజయవాడ వెళ్తాడు అర్జున్‌. అయితే అమల మాత్రం అర్జున్‌ని ‘నువ్వెవరు.. నిన్నింత వరకూ చూడలేదే' అని ప్రశ్నిస్తుంది. అంతే కాదు.. ‘నాపేరు అమల కాదు.. నిత్య' అంటుంది. దాంతో అర్జున్‌ షాక్‌ అవుతాడు. అప్పుడే ఇంకో ట్విస్ట్ పడుతుంది అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది. అదే సమయంలో మరోసారి అమల నుంచి అర్జున్ కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నా అని ఫోన్ చేసి చెపుతుంది అమల. అంటే ఆ దెయ్యమే ఫోన్ చేసిందా అనే సందేహం వస్తుంది. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ. 

     

    **Note:Hey! Would you like to share the story of the movie ఎక్కడికి పోతావు చిన్నవాడా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X