twitter

    విమర్శకుల సమీక్ష

    • ఆధునిక ప్రపంచంలో సాంకేతికతను ఆసరాగా చేసుకొని అమ్మాయిలను వేశ్యవృత్తిలోకి లాగడం, వారు ఎదురిస్తే.. అశ్లీల, అసభ్య వీడియోలను యూట్యూబ్‌లో పోస్టు చేయడం లాంటి అనాగరిక చర్యలు భారీ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. అలాంటి కథను బేస్ చేసుకొని వచ్చిన చిత్రం ఈటీ.. ఎవరికి తలవంచడు సినిమా. తమిళ వాసనలు, మసాలు దట్టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచి ఎమోషనల్ పాయింట్‌ను ఆసక్తికరంగా, ప్రేక్షకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పలేకపోవడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. సూర్య చిత్రాలను ఆదరించే వారికి కూడా ఈ సినిమా నచ్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈటీ నచ్చుతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X