twitter
    TelugubredcrumbMoviesbredcrumbFidaabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తొలిభాగంలో అన్నదమ్ముల మధ్య అనుబంధం, అక్కా, చెలెల్లు, తండ్రి, కుటుంబాల మధ్య అనుబంధాలను చాలా చక్కగా తెరెక్కించాడు శేఖర కమ్ములు. శేఖర్ విజన్‌ తగినట్టు వరుణ్, సాయి పల్లవి తెరమీద అద్భుతంగా కనిపించారు. ప్రధానంగా సాయి పల్లవి చుట్టూ అల్లుకున్న తీరు శేఖర్ ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. ఆనంద్, గోదావరి చిత్రాల్లో రాణిముఖర్జీని నటనపరంగా ఎలా వాడుకొన్నాడో.. అంతుకుమించి సాయిపల్లవి నుంచి నటన రాబట్టాడు. ప్రతీ ఫ్రేమ్‌లో సాయి పల్లవి అందం, అభినయంతో ప్రేక్షకుడిని ప్రేమతో కట్టిపడేస్తుంది. సాయి పల్లవి నటన చూస్తే తెలుగు పరిశ్రమకు సావిత్రి, జయసుధ, సౌందర్య లాంటి నటి దొరికిందనే భావనను కల్పించడంలో శేఖర్ సఫలమయ్యాడు. వరుణ్‌ విషయానికి వస్తే తొలి భాగంలో చాలా చలాకీగా గత చిత్రాలకు భిన్నంగా పరిణతితో కూడిన మంచి నటనతో కనబరిచాడు. తొలి భాగంలో వరుణ్, సాయి పల్లవి కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా హెల్తీగా కనిపించడం ఫ్యామిలీ ఆడియెన్స్ ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతాయి.

      సాయి పల్లవి, వరుణ్ ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు, వారి మధ్య విభేదాలు, ద్వేషం, కోపం, ప్రేమ ఇవన్నీ అంశాలను కలబోసి సరికొత్తగా సీన్లను ఆవిష్కరించారు. భావోద్వేగమైన నటనతో ఒకరికొకరు పోటీ పడ్డారు. సినిమా రెండో భాగంలో ఫీల్‌గుడ్ సన్నివేశాలను పక్కా సన్నివేశాలతో పరుగులు పెట్టించాడు. సాధారణంగా కామెడీ ట్రాక్‌ను సపరేట్‌గా పెట్టి సినిమాలు తీయడం టాలీవుడ్ ట్రెండ్. కానీ ఈ ట్రెండ్‌ను శేఖర కమ్ముల గండికొట్టాడు. పాత్రల మధ్య సన్నివేశాల్లోనే ఆరోగ్యకరమైన కామెడీని పండిస్తూ కాఫీ లాంటి సినిమాను మళ్లీ అందించాడు శేఖర్ కమ్ముల. అనామిక మిగిల్చిన చేదు అనుభవంతో శేఖర కమ్ముల.. ఫిదాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గత మూడేళ్లుగా కసితో ఉన్నట్టు కనిపించింది. అందుకు అందుకు మించిన ఫలితమే రాబట్టాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X