విమర్శకుల సమీక్ష

  • తండ్రి కొడుకుల బంధాలు, అనుబంధాలతో సాగే గాలి సంపత్‌ భావోద్వేగాలకు అత్యంత తావు ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. కానీ వాటిని ఆవిష్కరించడంలో యూనిట్ విఫలమైంది. రాజేంద్ర ప్రసాద్ పాత్రను, శ్రీ విష్ణు లవ్ ఎపిసోడ్‌ను మరింత ప్రభావవంతంగా తెరకెక్కించి ఉంటే తప్పకుండా ఈ చిత్రం ఫీల్‌గుడ్ మూవీగా మారి ఉండేది. అలాంటి అవకాశాన్ని అనిల్ రావిపూడి టీమ్ చేజార్చుకొన్నది. మానవ సంబంధాల ఆధారంగా వచ్చే సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయితే కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించడానికి ఛాన్స్ ఉంది.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X