గ్యాంగ్ (2018)(U/A)
Release date
12 Jan 2018
genre
గ్యాంగ్ స్టోరి
గ్యాంగ్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, కీర్తి సురేష్, రమ్య కృష్ణ, కార్తిక్, బ్రహ్మానందం, నంద తదితరలు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విఘ్నేష్ శివన్ వహించారు మరియు నిర్మాత జ్ఞానవేల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.
కథ
తిలక్ (సూర్య), బుజ్జమ్మ( రమ్యకృష్ణ) ఇద్దరూ కలిసి మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్గా ఏర్పడి నకిలీ సీబీఐ ఆఫీసర్లుగా, నకిలీ ఇన్కంటాక్స్ ఆఫీసర్లుగా అవతారం ఎత్తి రైడ్స్ చేస్తూ అవినీతి పరులకు వద్ద ఉండే బ్లాక్ మనీ కొట్టేస్తుంటారు. అది అవినీతి సొమ్ము కావడంతో ఎవరూ కంప్లయింట్ చేయడానికి సాహసించరు. ఈ గ్యాంగ్ చేసే పనులు పోలీస్, సీబీఐ, ఇన్కంటాక్స్ డిపార్టుమెంటుకు తలనొప్పిగా మారుతుంది. వీరి ఆటకట్టించడానికి స్పెషల్ ఆఫీసర్ శివశంకర్ (కార్తీక) రంగంలోకి దిగుతాడు. ఈ గ్యాంగ్ ఇదంతా ఎందుకు చేస్తోంది? ఆ డబ్బంతా వారు ఏం చేస్తున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. నకిలీ సీబీఐ ఆఫీసర్ పాత్రలో సూర్య ఆకట్టుకునే నటన ప్రదర్శించాడు. అయితే ఇది కన్నింగ్, డూప్లికేట్ పాత్ర కావడంతో పవర్ ఫుల్ డైలాగులు, ఎమోషన్స్ లాంటివి చూపించే అవకాశం లేకుండా పోయింది. అయితే పాత్రకు తగిన విధంగా సూర్య పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనేలా ఉంది.
**Note:Hey! Would you like to share the story of the movie గ్యాంగ్ with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు