గౌతమ్ నంద (2017)(U/A)
Release date
28 Jul 2017
genre
విమర్శకుల సమీక్ష
-
‘ధన మూలమిధమ్ జగత్', ‘డబ్బు అన్నింటికి పరిష్కారం కాదు' అనే రెండు అంశాలను ఓ సింగిల్ పాయింట్ చేసుకొని గౌతమ్‌నంద చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ నంద. ఈ చిత్రంలో గౌతమ్ క్యారెక్టర్, నంద క్యారెక్టర్లను ఎలివేట్ చేయడంతోనే తొలిభాగంలో ఎక్కువ సమయాన్ని తీసుకొన్నాడు దర్శకుడు. రెండు ఫైట్లు, మూడు పాటలతో సాదాసీదాగా గడిచిపోతుంది. రొటీన్ సినిమా చూస్తున్నామా అనే ఫిలింగ్ గురయ్యే ప్రేక్షకుడికి ఇంటర్వెల్ ముందు ఆసక్తికరమైన ట్విస్ట్‌తో రెండో భాగంపై ఆసక్తిని రేపి దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నారు. ఇక రెండో భాగంలో నంద కుటుంబ సభ్యుల మధ్య గౌతమ్ జీవితాన్ని చక్కగా దర్శకుడు చిత్రీకరించాడు. సెంటిమెంట్ సన్నివేశాలు ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. ఇక ప్రీక్లైమాక్స్ నుంచి సినిమా మరో రేంజ్‌కు చేరుతుంది. ప్రీ క్లైమాక్స్ మొదలైన నుంచి ఎండ్ టైటిల్ పడే వరకు సన్నివేశాలు ఆసక్తికరంగా చకచక దూసుకుపోతాయి. సినిమా చివరి 30 నిమిషాలు గోపిచంద్ తన నటనతో ప్రేక్షకులకు కొత్త అనుభూతికి గురవుతారు. ఓవరాల్‌గా గోపిచంద్‌ను కొత్త కోణంలో చూశానమనే భావన ప్రేక్షకులకు కలుగడం ఈ సినిమాకు ప్రధానమైన బలం.
సంబంధిత వార్తలు