twitter
    TelugubredcrumbMoviesbredcrumbGentlemanbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమా ఎప్పటిలాగే నాని వన్ మేన్ షో అనే చెప్పాలి. నాని తప్ప మరొకరు ఈ సినిమా చెయ్యలేరేమో అని ఖచ్చితంగా ఓ నిర్దారణకు వస్తారు. టైటిల్ కు తగ్గట్లే ...నాని విలనా, హీరోనా అనే డౌట్ మొదటి నుంచి చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ విషయంలో ఇంద్రగంటికి వందకు వెయ్యి మార్కులు పడతాయనటంలో సందేహం లేదు. ఈ సినిమాకు సంగీతం అంటే పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మణిశర్మను కొట్టినవారు లేరు. అది నిజం అని మరోసారి ప్రూవ్ అవుతుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలలో మొదటి నుంచి కామెడీ కు ప్రయారిటి ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి కాస్త తక్కువ అంటే బాగా తక్కువే ఇచ్చారు..కథ డిమాండ్ మేరకు. ఇలాంటి కథల్లో కామెడీ ఎక్సపెక్ట్ చేయరనుకున్నారు. అది నిజం కూడా . కొంతలో కొంత వెన్నేల కిషోర్ నవ్వించాడు. నివేదిక అద్బుతంగా చేస్తే, సురభి గ్లామర్ తో ఆకట్టుకుంది. దర్శకుడు సినిమాని పూర్తి సస్పెన్స్ తో నడపటంలో సక్సెస్ అయితే, నిర్మాత ఖర్చు, ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడూ, సినిమాలో నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X