twitter
    TelugubredcrumbMoviesbredcrumbGhazibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. తరవాతేం జరుగుతుందన్నటెన్షన్ ని ఎస్టాబ్లిష్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. వాస్తవానికి మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా' అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలోనే డైరక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కథకు అవసరమైన ఎమోషన్ ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడనిపిస్తుంది. దీంతో సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి నిరాశే. చివర్లో ...ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజి' ని కూల్చే సన్నివేశాలు ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో లేవు. ఇంకాస్త వివరంగా చూపి ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాగే తాప్సి పాత్రకు ప్రయారిటీ లేదు. ఏదో ఉన్నామంటే ఉందంతే.. ఇలాంటి కథలను విజువలైజ్ చేయటం, తెరకెక్కించటం అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యంగా అతి తక్కువ పాత్రలతో.. వార్ సీన్స్ తో అంతసేపు కదలకుండా కూర్చోబెట్టడం.. టైట్ స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X