twitter

    గూఢచారి స్టోరి

    గూఢచారి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అడివి శేష్, శోభిత, ప్రకాష్ రాజు, సుప్రియ యర్లగడ్డ, వెన్నెల కిశోర్, అనీశ్ కురువిల్ల, మధు శాలిని, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శశికిరణ్ వహించారు మరియు నిర్మాతలు అభిషేక్ నామా, టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు. 

     

    కథ


    అర్జున్ అలియాస్ గోపి (అడివి శేషు) దేశ భద్రతకు పాటుపడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో చేరాలని కలలు కంటాడు. దేశం కోసం పనిచేస్తూ చనిపోయిన తన తండ్రి ఆశయాలను కొనసాగించాలనుకొంటాడు. తన గాడ్ ఫాదర్ సత్య (ప్రకాష్ రాజ్) సంరక్షణలో పెరుగుతున్న అర్జున్ దేశ భద్రతకు సంబంధించిన త్రినేత్ర అనే మిషన్‌లో చేరుతారు. అక్కడ పనిచేసే బృందం (అనీష్ కురివిల్లా, యార్లగడ్డ సుప్రియ (నదియా), వెన్నెల కిషోర్, మధుశాలిని (లీనారాజన్))తో కలిసి పనిచేస్తాడు. ఆ సమయంలోనే సైక్రియాటిస్ట్ (శోభిత ధూళిపాల)తో ప్రేమలో పడుతాడు. కానీ తన ప్రేయసి చేసిన కారణంగా తన అధికారి (అనీష్), మరో మంత్రిని తీవ్రవాదుల కాల్పుల్లో పోగొట్టుకొంటాడు. ఈ క్రమంలో అర్జున్‌పై దేశద్రోహ నేరం మోపబడుతుంది. తన టీమ్‌లోనే ఒకరు తీవ్రవాదులకు సమాచారం అందిస్తున్నారని తెలుసుకొంటాడు. ఈ నేపథ్యంలో తన తండ్రి రానా (జగపతిబాబు) చనిపోలేదని తెలుసుకొంటాడు. దేశద్రోహం కేసులో ఇరుక్కొన్న అర్జున్ ఎలా బయటపడ్డాడు? చనిపోయాడనుకొన్న తన తండ్రి ఎలా బతికాడు? తన తండ్రిని కలుసుకొన్న తర్వాత ఎదురైన సంఘటనలు ఏంటీ? త్రినేత్రలో పనిచేస్తూ ఉగ్రవాదులకు సమాచారం అందించేది ఎవరు? అర్జున్ మిషన్‌లో ప్రకాశ్ రాజ్ పాత్ర ఏంటి? యార్లగడ్డ సుప్రియ, మధు శాలిని పాత్రలేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే గూఢచారి సినిమా కథ.

     

    **Note:Hey! Would you like to share the story of the movie గూఢచారి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X