గుండెల్లో గోదారి (2013)(U/A)
Release date
08 Mar 2013
genre
విమర్శకుల సమీక్ష
-
ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో చెప్పిన ఈ కథ.. ఇద్దరు జీవితాలకు చెందిన గతాన్ని విప్పి చెప్తుంది. ఫస్టాఫ్ లో హీరో ఆది తన గురించి చెప్పిన గతం తాప్సీ.. తో రొమాన్స్ కలగలసి కలర్ ఫుల్ గా... ఉషారుగా సాగిపోయింది. అదే సెకండాఫ్ కి వచ్చేసరికి.. లక్ష్మి ప్రసన్న ప్లాష్ బ్యాక్ చాలా డార్క్ షేడ్స్ తో.. పూర్తి సెంటిమెంట్ టచ్ తో... మెలోడ్రామా గా మారి, విసిగించింది. ఆది ప్లాష్ బ్యాక్ లాగే.. సింపుల్ గా.. లక్ష్మి ప్రసన్న గతం కూడా ఎక్కువ గజిబిజి చెయ్యకుండా ఆవిష్కరించి ఉండి ఉంటే బావుండేది. అయితే తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నాం కదా అనుకుని రాసామో ఏమో కానీ... మరీ అతి సెంటిమెంట్ తో సీన్స్ నడిపించారు. దానికి తోడు క్లైమాక్స్ అందరూ ఊహించిందే కావటం కూడా ఇబ్బంది కర అంశం.