twitter

    విమర్శకుల సమీక్ష

    • సాధారణంగా దెయ్యాలు భయపెడుతూంటే చాలా టెర్రిఫిక్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో దెయ్యం చాలా మంది దెయ్యంలా ఉంది. పెళ్లి చేసుకోమని గోల తప్పిస్తే పెద్దగా భయపెట్టే కార్యక్రమాలు పెట్టుకోదు. అలాంటి దెయ్యాన్ని చూస్తూంటే భయం వెయ్యకపోగా జాలి వేస్తుంది. పాపం హీరో ..ఆ దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే పోలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కామెడీ ఉన్నా కూడా నాగేశ్వర్ రెడ్డి, నరేష్ ల కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. ఇక ప్రతి హర్రర్ సినిమాలానే ఈ చిత్ర క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది. కథ మధ్యలో ప్రేమ అనే పాయింటును సరిగ్గానే జొప్పించినా దాన్ని చివరి వరకూ తీసుకురావడం, దానికి మంచి ఫీల్ తో కూడిన ముగింపు ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. కథలో కీలకమైన దెయ్యం ప్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ నూటికి నూరు శాతం న్యాయం జరగక, క్లైమాక్స్ లో వెలితిగా అనిపించింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X