twitter
    TelugubredcrumbMoviesbredcrumbIsmbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నల్లధనం వంటి సీరియస్ సబ్జెక్టుని ఓ కాకమ్మ కథలా అల్లిబిల్లిగా అల్లేసి మన ముందుంచే ప్రయత్నం చేసారు పూరి. ఈ కథలో హీరో తెహల్కా వంటి వెబ్సైట్ నడుతూ స్కామ్ లు అన్నీ లీక్ చేస్తూండాడు. అంతపెద్ద స్కామ్ లు లీక్ చేసినా ఎక్కడా అతనికి ఎదురనేది ఉండదు. ఇంటిలిజెన్స్ వారు కూడా పట్టుకోలేని...దావూద్ ఇబ్రహం స్దాయి మాఫియా డాన్ ని కలవటం, అతని ఇంటికి వెల్లటం వంటివి చాలా ఈజీగా చేసేస్తూంటాడు. దాంతో హీరో క్యారక్టరైజేషన్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టేసింది. ఇందులో జగపతిబాబు క్యారక్టరైజేషన్ చూస్తూంటే నవ్వు వస్తుంది. ఓ టోపి పెట్టుకుని, బీడి కాల్చుకుంటూ ఉంటాడు. ఎక్కడా కరుకుతనం అనేది ఉండదు. అతను విలన్ ముసుగులో ఉన్న మంచివాడేమో అనే డౌట్ వస్తూంటుంది. సినిమా సగం అయ్యేసరికి విలన్ జగపతి బాబు నా లేక పోసానా లేక, మన పొలిటీషన్స్ అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే మాఫియా డాన్ కు వ్యతిరేకంగా చేస్తున్ననంటూ అతను బ్లాక్ మనీ ని బయిటకు తెచ్చే పనిలో ఉంటాడు. హీరో లక్ష్యం..బ్లాక్ మనీ బయిటకు తేవటమా లేక మాఫియా డాన్ ని అంతమొందించటమా తేలదు. దాంతో కథ ఎవరిని ఫాలో అవ్వాలో తెలియని స్దితి ఏర్పడింది. విలన్ ని మచ్చిక చేసుకోవటానికి అతని బలహీనత అయిన కరీం బీడి కట్టని అతని ఎదురుగా కాల్చి, అతనితో ప్రెండ్షిప్ చెయ్యవలను అనే కొత్త విషయం మనకు ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. ఏదో అల్లరి నరేష్ సినిమాలో సీన్ లాగ ఉంటుంది కానీ ఎక్కడా సీరియస్ గా అనిపించదు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X