twitter
    TelugubredcrumbMoviesbredcrumbJai SimhabredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • నయనతారకు దూరం కావాలన్న ఏకైక కారణంతో బాలకృష్ణ కుంభకోణం వెళ్లే సీన్‌తో సినిమా ప్రారంభమవుతుంది. కుంభకోణంలో ఎన్నో అవమానాలు దిగమింగుతూ.. ఎవరెన్నీ దాడులు చేసినా సాధువులా జీవితాన్ని గడుపుతుంటాడు. తన మనసులో ఉండే బాధను దిగమింగుకుంటూ తన కుమారుడి కోసం జీవితం సాగిస్తుంటాడు. ఓ అనూహ్యమైన సంఘటన వల్ల బాలకృష్ణ ఫ్లాష్‌బ్యాక్ గురించి చెప్పే సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. రెండో భాగంలో నయనతార, బాలకృష్ణ ప్రేమ ఎపిసోడ్స్, మెకానిక్ షాపులో హరిప్రియతో అల్లరి ఎపిసోడ్స్‌తో కథ రొటీన్‌గా సాగిపోతుంది. ఇక నయనతారకు షాకిచ్చి హరిప్రియను పెళ్లి చేసుకోవడం, రౌడీలు అశుతోష్ రాణా, బాహుబలి ప్రభాకర్‌ను హతమార్చడం, ఆ తర్వాత ఓ సెంటిమెంట్ సీన్‌తో సినిమా ముతకగా ముగుస్తుంది.

      బాలకృష్ణ ఇమేజ్ ఏ మాత్రం తగ్గని కథ జై సింహా. కానీ కథ, కథనం, సన్నివేశాల రూపకల్పనలో దారుణంగా విఫలయ్యారనే వాదన వినిపిస్తున్నది. 80వ దశకంలో ఇంత నాసిరకంగా సినిమా తీసి ఉండరనే మాటలు వినిపించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య చేయాల్సిన సినిమా కాదనే మరో మాట వినిపిస్తున్నది. సంక్రాంతి రేసులో ఫ్యాన్స్ కొంత సంతోషం కలిగినా.. సగటు ప్రేక్షకుడికి మాత్రం కొంత నిరాశే అని చెప్పవచ్చు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X