twitter

    జంబ లకిడి పంబ స్టోరి

    జంబ లకిడి పంబ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీనివాస రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ, మురళి, తనికెళ్ల భరణి, జయప్రకాష్ రెడ్డి, వెన్నెల కిశోర్, సుధా, సత్యం రాజేష్, జబర్ధస్థ్ అప్పారావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి దర్షకత్వం జె బి మురళీ కృష్ణ వహించారు మరియు నిర్మాత రవి, జో జో జోస్, శ్రీనివాస్ రెడ్డి ఎన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ అందించారు.   

    కథ

    వరుణ్ (శ్రీనివాస్‌రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత వారి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు తలెత్తుతాయి. అమితంగా ప్రేమించుకొన్న వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకొంటాయి. దాంతో విడిపోవాలని విడాకులకు దరఖాస్తు చేసుకొంటారు. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ విడాకులు ఇప్పించడంలో సిద్ధహస్తులు. 99 మంది దంపతులకు విడాకులు ఇప్పించి 100 కేసుగా వరుణ్, పల్లవి విడాకుల కేసును టేకప్ చేస్తారు. కానీ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చేసుకొన్న ఊహించని ఓ సంఘటనతో వరుణ్, పల్లవి జీవితాలు తారుమారవుతాయి. వరుణ్ దేహంలోకి పల్లవి ఆత్మ, పల్లవి దేహంలోకి వరుణ్ ఆత్మ ప్రవేశించడం వల్ల కథ కొత్త మలుపుతిరుగుతుంది. దంపతులను విడగొట్టడంలో ఫేమస్ అయిన లాయర్ హరిశ్చంద్రప్రసాద్‌కు వరుణ్, పల్లవి దంపతులను కలిపే బాధ్యత నెత్తిపై పడుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హరిశ్చంద్రప్రసాద్‌కు ఏమి జరిగింది? లాయర్ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటన ఏంటి? వరుణ్, పల్లవి విడాకులు తీసుకోవడానికి కారణం ఏమిటి? ఒకరి దేహంలోకి మరొకరి ఆత్మలు మారిన తర్వాత ఏం జరిగింది? ఇంతకీ వరుణ్, పల్లవికి విడాకులు లభించాయా? అనే ప్రశ్నలకు సమాధానమే జంబలకిడి పంబ కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie జంబ లకిడి పంబ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X