twitter
    TelugubredcrumbMoviesbredcrumbJayadevbredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • తొలి భాగంలో హీరో ఇంట్రడక్షన్, విలన్ అకృత్యాలు, హీరోయిన్ ఎంట్రీ లాంటి రొటీన్ వ్యవహారాలనే కనిపిస్తాయి. గంటా రవి తొలి పరిచయం కాబట్టి దర్శకుడు జయంత్ ఆయనను నుంచి ప్రతిభను రాబట్టడానికి చేసిన కృషి తెరమీద కనిపిస్తుంది. ఎయోషన్స్ పలికించడానికి రవి చేసిన ప్రయత్నం అభినందనీయం. తోటి పోలీస్ అధికారిని చంపిన మస్తాన్ రాజును శిక్షపడేసేందుకు చేసే పోరాటంలో కొంత పట్టు సాధించే సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది. హీరో సస్పెన్షన్ కావడం, చేతిలో ఉండే ఆధారాలు ఒక్కొక్కటి జారిపోతుండటం. ఆ క్రమంలో హీరో వేసే ఎత్తులను దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించడంలో తడబాటు పడ్డాడు. ఇక హీరోయిన్ మాళవిక రాజ్ పాత్ర పాటలకే పరిమితం చేశాడు. సీనియర్ నటుడు వినోద్‌కుమార్‌లో పవర్ ఫుల్ విలనిజం కనిపించకపోవడం, దానికి తోడు రవి నటనాపరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనపడటం సినిమా సాదాసీదాగా సాగిపోతుంది. రోటీన్ తరహాలో మస్తాన్ రాజును ఆటకట్టించడంతో జయదేవ్‌కు ఎండ్ టైటిల్ పడిపోతుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X