twitter
    TelugubredcrumbMoviesbredcrumbJulayibredcrumbCritics Review

    విమర్శకుల సమీక్ష

    • ఇక అల్లు అర్జున్ నుంచి ప్రేక్షకులు ఆశించే హీరోయిజం స్టైలిష్ టేకింగ్ హడావిడిలో కనపడకుండా పోయింది. రాజేంద్రప్రసాద్ విషయానికి వస్తే ఆయనకు, అల్లు అర్జున్ కి వచ్చే ట్రాక్ తమిళ వెట్టై ని గుర్తు చేసినా బాగానే పేలింది. అయితే త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్ గా హైలెట్ అయ్యే బ్రహ్మానందం.. చిల్లర దొంగతనాలు కామెడీ పెద్దగా నవ్వులు పూయించలేకపోయింది. ఎమ్.ఎస్ నారాయణ, హేమ ఎప్పటిలాగే తమ పరిధిలో చేసుకుపోయారు. తణికెళ్ల భరిణి ఏ సినిమాలో చూసినా అదే తండ్రి పాత్ర కాబట్టి పెద్దగా చెప్పుకునేందుకు లేదు. అల్లు అర్జున్ మాత్రం ఎప్పటిలా తన దైన శైలిలో డాన్స్ లు, హుషారుతో స్క్రీన్ సేవ్ చేసారు. త్రివిక్రమ్ డైలాగుల్లో గతంలో పంచ్ మాయమైంది. అక్కడక్కడ మాత్రమే ప్రాసలు పేలాయి. దర్సకుడు మాత్రం ఓ కొత్త తరహా సినిమాకు ట్రై చేసాడని చెప్పవచ్చు. కెమెరా పనితనం బావుంది. ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత ట్రిమ్ చేస్తే బావుండేది. పాటల్లో టైటిల్ సాంగ్, మధు..మధు బాగున్నాయి. రీ రికార్డింగ్ చాలా సీన్స్ కు ప్లస్ అయ్యింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X