twitter

    కాష్మోరా స్టోరి

    కాష్మోరా సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తీక్ శివకుమార్, నయనతార, శ్రీ దివ్య, వివేక్, సిద్దార్థ్ విపిన్, జంగిరి మధుమిత తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోకుల్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయన్ స్వరాలు సమకుర్చరు.

    కథ

    దయ్యమే జీవితం..దయ్యమే శాశ్వతం అంటూ , అవి ఉన్నాయంటూ నమ్మిస్తూ..డబ్బు చేసుకుంటూ హ్యాపీగా బ్రతికేస్తూంటాడు క్యాష్‌ అలియాస్‌ కాష్మోరా(కార్తీ). కాశ్మోరాకు ప్లస్ పాయింట్ ఏమిటి అంటే అతని తండ్రి (వివేక్), నాయనమ్మ, అమ్మ, చెల్లి అంతా అదే బాపతు. అదే స్కూల్. అంతా కలిసి హ్యాపీగా తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటారు. ప్రేతాత్మల నుంచి ప్రజలకి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటారు. కాశ్మోరాకి సొంత కుటుంబం కూడా తోడుంటంతో ఇంకా రెచ్చిపోయి.... ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శిస్తూ.. కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. అయితే అదే కొంపముంచుతుందని తెలియదు. అలా హ్యాపీగా జనాల మనస్సుల్లో ఉన్న భయాలతో ఆడుకుంటూ..పూటతో దెయ్యాన్ని పోగుడతూ డబ్బు వెనకేసుకుంటున్న అనితికి ఒకరోజు ఒక వ్యక్తి తన కోటలో ఉన్న దెయ్యాల్ని బయటికి పంపమని, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. దాంతో కాష్మోరా ఆ కోటలోకి వెళ్లి తన కుటుంబంతో సహా ఇరుక్కుపోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే...కాశ్మోరా అక్కడికి వెళ్లలేదు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్‌ (కార్తీ) రప్పించాడు. తమకి విముక్తి కోసం కాశ్మోరాని వాడుకోవాలనుకున్నాడు. ఇంతకి రాజ్ నాయక్ కు ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్‌ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి?

    700 ఏళ్ల క్రితం మహాసామ్రాజ్యంగా విలసిల్లింది విక్రాంత రాజ్యం. సైన్యాధ్యక్షుడైన రాజనాయక్(కార్తీ) శౌర్య పరాక్రమాల కారణంగా రాజ్యం సువిశాలంగా విస్తరిస్తుంది. అయితే కథనరంగంలో అరివీర భయంకరుడైన రాజనాయక్ స్త్రీలోలుడు. ఆ కారణంగానే విక్రాంత రాజ్య యువరాణి రత్నమహాదేవి(నయనతార)ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. తను ఇష్టపడ్డ రత్నమహాదేవి కోసం మహారాజు, యువరాజుతో పాటు యువరాణి ప్రేమించిన వ్యక్తిని కూడా చంపేస్తాడు. మహా పరాక్రమవంతురాలైన యువరాణి రత్నమహాదేవి పథకం ప్రకారం రాజనాయక్ ను అంతమొందిస్తుంది. కానీ ఆ పోరాటంలో ఆమె కూడా ప్రాణాలు విడుస్తుంది. చనిపోతూ రాజనాయక్ ఆత్మకు శాంతి కలగకుండా ఎప్పటికీ భూలోకంలోనే ప్రేతాత్మగా ఉండిపోవాలని శపిస్తుంది. అప్పటి నుంచి తన శాప విముక్తి కోసం ఆత్మగా ఎదురు చూస్తుంటాడు రాజనాయక్. అరుంధతి గుర్తుకు వస్తోంది కదూ..దెయ్యల మీద రిసెర్చ్ చేస్తున్న యామిని(శ్రీదివ్య) తన రిసెర్చ్ కు సాయం చేయమంటూ కాష్మోరా దగ్గర చేరుతుంది. దెయ్యాలతో ఎప్పుడూ టచ్ లో ఉండే కాశ్మోరాతో కలిసి పనిచేస్తానంటుంది. అయితే ఆమెకు కాశ్మోరా మీద డౌట్ ఉంటుంది. అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలనుకుంటుంది. ఈ కథలో ప్రేతాత్మ కాకుండా మరో విలన్ ఉంటాడు. వాడో పొలిటీషన్. వాడు కూడా మన హీరో కాశ్మోరా దగ్గర నిజంగానే శక్తులున్నాయని నమ్ముతాడు. అతను మన హీరోని చేరదీసి, నమ్మి ఇన్ కమ్ టాక్స్ వాళ్లు దాడి చేస్తున్నారంటే తన దగ్గర ఉన్న ఐదు వందల కోట్లు దాస్తాడు. అయితే మన హీరో, అతని తండ్రి తక్కువ వాళ్లా..ఆ విలన్ మోసం చేసి అతని అక్రమ సంపదనంతా తీసుకొని కుటుంబంతో సహా విదేశాలకు పారిపోవాలని ప్లాన్ చేస్తాడు కాష్మోరా. మరి అనుకున్నట్టుగా కాష్మోరా విదేశాలకు పారిపోయాడా..? నిజానకి కాశ్మోరా ద్వారా...విముక్తి అవ్వాలని రాజ్ నాయక్ ప్రేతాత్మ పిలవలేదు. దానికి వేరే మోటివ్ ఉంది. అయితే ఇక్కడ ఈ కథకి, రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్‌ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie కాష్మోరా with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X