twitter

    కళావతి స్టోరి

    కళావతి సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సిద్దార్థ్ నారాయన్, త్రిషా కృష్ణా, హన్సిక మోత్వాని, సుందర్ సి, పూనం భజ్వ, సూరి, కోవై సరళ, మనోబాల, రాధా రవి, రాజ్ కపూర్, ఆదుకలం నరేష్, సుబ్బు పంచు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు మరియు గుడ్ ఫ్రెండ్స్ నిర్మాణ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హిప్ హోప్ తమిజ స్వరాలు సమకుర్చరు. 

    కథ

    ఊరి జమీందార్ (రాధారవి) తమ గ్రామంలో అమ్మవారికి కుంభాభిషేకం ప్లాన్ చేసి ఎన్నాళ్లగానో ఉంటున్న అమ్మవారి విగ్రహాన్ని తీసి ప్రక్కన పెడతారు. దాంతో ఊరిని కాపాడుతున్న అమ్మవారు అడ్డు తొలగగానే ప్రేతాత్మ ఒకటి ఆ ఊళ్లోకి ప్రవేశించి..జమీందార్ గారి ఇంట్లో కి వచ్చేస్తుంది. వచ్చేసి ఆ జమీందారునే చంపటానికి ప్రయత్నం చేస్తుంది. దాంతో ఆయన కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు సిటీలో ఎంజాయ్ చేస్తున్న ఆయన కొడుకు మురళి(సిద్దార్) ఊళ్లోకి దిగుతాడు. అతనితో పాటు గర్ల్ ఫ్రెండ్ అనిత(త్రిష) కూడా ఆ భవంతికి వస్తుంది. అప్పటినుంచీ జమిందారి భవంతిలో ఎన్నో విచిత్రమైన ఎక్సపీరియన్స్ ఎదురౌతాయి మురళికి. అంతేకాదు ఒక వ్యక్తి మర్డర్ కూడా అవుతాడు. దాంతో ఆ మర్డర్ కేసు మురళిపై పడుతుంది. అప్పుడు రంగంలోకి దిగుతాడు అనిత అన్నయ్య...వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అయిన రవి (సుందర్ .సి).అతను వచ్చి అసలు ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. అసలేం జరుగుతోందో తెలుసుకోవాలని సీసి కెమెరాలు పెడతాడు. వాటిలో కళావతి (హన్సిక) కనిపిస్తుంది. అంతా షాక్. ఎందుకంటే కళావతి చనిపోయి చాలా కాలం అయ్యింది. ఈలోగా కళ ఆత్మ...సిద్దార్ధని, త్రిషను కూడా చంపటానికి ప్రయత్నిస్తుంది... ఇంతకీ కళ ఎవరు...ఆమె ఎందుకు చనిపోయింది..కుంభాభిషేకం జరిపారా అనేది మిగతా సినిమా . మురళి ప్రాణాలు దక్కాయా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
    **Note:Hey! Would you like to share the story of the movie కళావతి with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X