twitter

    విమర్శకుల సమీక్ష

    • సినిమా పరిశ్రమ అనేది బయిటకు కనపడినంత గ్లామర్ గా లోపల ఉండదనేది అందరికీ తెలిసిన నిజమే అయినా ఒప్పుకోవటానికి ఎవరికీ ఆసక్తి ఉండదనేది నిజం. అందుకేనేమో సినిమావాళ్ళ మీద సినిమా తీయటం ఎప్పుడూ సాహసమేనంటారు సినీ జీవులు. అయితే అప్పుడప్పడూ కొందరు ధైర్యం చేసి సినీ పరిశ్రమ బ్యాక్ గ్రౌండ్ లో నేనింతే,ఒక విచిత్రం వంటివి రూపొందిస్తూనే ఉన్నారు...భాక్సాఫీస్ వద్ద బోల్తా కొడ్తూనే ఉన్నారు. ఆ కోవలో సునీల్ వంటి కామిడీ హీరోని పెట్టుకుని సీరియస్ సినిమా ..అదీ సినీ బ్యాక్ గ్రౌండ్ లో చేసిన ఘనత మాత్రం నిత్య ప్రయోగశీలి రామ్ గోపాల్ వర్మకే దక్కింది. కథను నమ్ముకుని చేసానంటున్న ఈ సినిమాకి ఆయన కామిడీ ప్యాండిగ్ ని అయితే ఇచ్చాడు గానీ, కామిడీ పంచ్ ని మాత్రం ఇవ్వలేకపోయారు. సునీల్ ఉన్నాడు కదా కామిడీ గ్యారెంటీ అని ధియోటర్ కి వెళ్ళిన సగటు ప్రేక్షకుడుకి నిరాశ ఎదురౌతోంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X